దేశంలో అత్యధిక తలసరి అప్పుల రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తికి రూ.1.17 లక్షల అప్పుల భారం ఉంది. ఈ చిన్న రాష్ట్రం అప్పు ఇప్పుడు రూ.86,589 కోట్లకు చేరుకుంది. మరోవైపు కొత్త పింఛను పథకం అమలు వల్లే రాష్ట్రం రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది.
మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వడం వల్ల ఆర్థికంగా భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ పథకాల భారం రాష్ట్రం మోయలేదని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు వాటికి కోత పెట్టడం ప్రారంభించింది. అన్ని కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని తొలగించి టికెట్‌లో 50 శాతం వసూలు చేయాలని నిర్ణయించింది. ఉచిత నీటి సరఫరా పథకాన్ని నిలిపివేయాలని భావిస్తోంది. మరోవైపు ఉన్న పథకాలకు కూడా కోత పడుతుండటం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, అలవెన్సులు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, పెన్షన్ సంక్షేమ నిధి నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
హామీల పేరుతో గెలిచిన కర్ణాటక, తెలంగాణల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీంతో ధరలను పెంచి ఖజానా నింపుకునేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం యత్నిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా హామీల అమలును పట్టించుకోవడం లేదు.
నేడు పథకాలు, సబ్సిడీల్లో కోత విధించేందుకు హిమాచల్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రేపు కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలు కూడా అదే వైఖరిని అవలంభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. 40ఏళ్ల చంద్రబాబు రాజకీయ అనుభవంతో అచరణకు సాధ్యమయ్యే పథకాలను మాత్రమే ప్రకటించి ప్రజల ఆదరణను చూరగొన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన వాగ్ధాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.