ఎంత ఎమ్మెల్యే, ఎంపీలు అయినా జీతాల కోసం వారూ చూస్తారు. వారి అవసరాలు వారికి ఉంటాయి. దేశంలో ఏ ప్రాంతంలో వినని విధంగా అక్కడ ఎమ్మెల్యేలకు రెండు నెలలుగా జీతాల్లేవ్ అన్న వార్త వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఉద్యోగులకు జీతాలు లేవని ఇతర సిబ్బంది కార్మికులకు జీతాలు అందడం లేదని మాత్రమే వార్తలు విన్నారు అంతా. చట్టాలను చేసే ఎమ్మెల్యేలకు జీతాలు లేవు అంటే అది వైరల్ అయ్యే న్యూసే మరి.
ఇంతకీ ఆ ప్రాంతం ఏంటి అంటే జమ్మూ అండ్ కాంశీర్. దీనికి రాష్ట్ర హోదా లేదు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. సెప్టెంబర్ లో ఎన్నికలు ఇక్కడ జరిగాయి. అక్టోబర్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అలియన్స్ అధికారంలోకి వచ్చాయి. అయితే రెండు నెలలు పూర్తి అయినా ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు లేవు. దాంతో ఏకంగా kashmir - SRINAGAR/JAMMU' target='_blank' title='జమ్మూ అండ్ కాశ్మీర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వానికి స్పీకర్ లేఖ రాశారు. అయితే ఇలా ఎందుకు జరుగుతోంది అంటే ఇక్కడ గతంలో ఉన్న నిబంధనలు, చట్టాలూ, ఎమ్మెల్యేలకు జీతాలు ఇచ్చేందుకు ఏ మాత్రం సరిపోయేలా లేవని అంటున్నారు.
95 మంది సభ్యులతో ఏర్పాటు అయిన కొత్త శాసనసభలో ఎమ్మెల్యేలకు ఒక నెల జీతం కూడా అందుకున్న ముచ్చట అయితే లేదని అంటున్నారు. దాంతో తన మొరను వారు స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ కి చెప్పుకున్నారు. ఎమ్మెల్యేల జీతాలు చెల్లించాలి అనుకుంటే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని అంటున్నారు. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం చూస్తే కనుక ఆ రాష్ట్ర అసెంబ్లీ స్వంత చట్టాన్ని రూపొందించే వరకు లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఎమ్మెల్యేల జీతాలను నిర్ణయించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.
అయితే తమకు ఇంత జీతం ఇన్ని రకాల అలవెన్సులు ఇవ్వాలని శాసనసభ ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తే ఆ మీదట దానిని లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదిస్తారని అంటున్నారు. అపుడు మాత్రమే వారికి జీతాలు వస్తాయని చెబుతున్నారు. మరి ఈ ప్రాసెస్ అయ్యేంతవరకూ ఎమ్మెల్యేలకు జీతాలు దక్కేది లేదని అంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం పొందితేనే తప్ప అది అమలులోకి రాదు, మరి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.