ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలను అమలులోకి తీసుకొచ్చింది. రైతులకు భరోసా కల్పిస్తూ,మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూ ఇలా అనేక రకాల పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకోని వచ్చింది. నిరుద్యోగుల కోసం కూడా ఒక అద్భుతమైన శుభవార్తను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బాగా చదువుకొని ప్రస్తుతం ఉపాధి లేకుండా సతమతమవుతున్న వారి కోసం ఒక కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
వివిధ రకాల పనులలో శిక్షణ ఇచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ధేయంగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. గ్రామీణ యువతకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ అందజేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది కేంద్ర ప్రభుత్వం. ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఎంతో అండగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వరంగల్ జిల్లా హసన్ పర్తి సంస్కృతి విహార్ లో ఉంది.
నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థ ముందుకు వెళుతుంది. ఈ సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ నేటి యువతను స్వయం ఉపాధి బాటలో చైతన్యవంతులను చేసి వాళ్లు తమకు తాము స్వయం ఉపాధి ద్వారా జీవితంలో స్థిరపడాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. చదువుకున్న చాలామంది చాలా కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ నిరుద్యోగులుగా ఉన్నారు.
ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా 13 వేలకు పైగా అభ్యర్థులకు శిక్షణ అందించగలిగారు. 36 రకాల శిక్షణ కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా అందించనున్నారు. బ్యూటీ పార్లర్ నిర్వహణ, టైలరింగ్, సెల్ ఫోన్ రిపేరింగ్, సెల్ఫోన్ సర్వీసింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, హౌస్ వైరింగ్, టీవీ టెక్నీషియన్, సీసీటీవీ సెక్యూరిటీ అలారం, స్మోక్ డిటెక్టర్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీసింగ్, టూవీలర్ మెకానిక్, అగర్బత్తి తయారీ, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్, ప్లంబింగ్, శానిటరీ పనులు ఇలా 36 రకాల కార్యక్రమాలకు ఈ సంస్థ నుంచి శిక్షణ అందిస్తున్నారు.
ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్ర ద్వారా అనేక మంది నిరుద్యోగులు లభి పొందుతారని తెలుస్తుంది.ఈ సంస్థ నుంచి అనేక పనులలో శిక్షణ తీసుకోని నిరుద్యోగులు ఉపాధి పొందాలని ఈ సంస్థ ప్రధాన ధ్యేయం.