'పుష్ప 2  సినిమా ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే.  బన్నీ అరెస్ట్, తదనంతర పరిణామాలు కొన్ని రోజుల పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడిచాయి.  ఈ వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగానే కీలక వ్యాఖ్యలు చేసారు.  


దావోస్‌ పర్యటనలో రేవంత్ రెడ్డి ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్ట్ పై మాట్లాడారు. ''ఒక స్టార్ హీరోని ఆ విధంగా అరెస్ట్ చెయ్యడం మంచిది కాదని చంద్రబాబు నాయిడు అన్నారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ నేరుగా బాధ్యుడు కాదు కదా?'' అని న్యూస్ యాంకర్ ప్రశ్నించగా.. ''ఎందుకు అరెస్ట్ చేసామో చంద్రబాబు నాయుడుకు పూర్తిగా తెలిసి ఉండదు.  దేన్నైనా రెండువైపులా చూసినప్పుడు వేరేలా కనిపించవచ్చు'' అని రేవంత్ రెడ్డి బదులిచ్చారు.  తొక్కిసలాటలో మహిళ చనిపోవడం అల్లు అర్జున్ చేతిలో లేకపోవచ్చు కానీ, పది రోజుల దాకా అతను వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకోలేదని అన్నారు.


''రెండు రోజుల ముందు అల్లు అర్జున్ పర్మిషన్ కోసం వస్తే, పోలీసులు దాన్ని నిరాకరించారు. అనుమతి లేకపోయినా అతను అక్కడికి వచ్చాడు. ఆయన సెక్యురిటీ సిబ్బంది అక్కడున్న జనాలను తోసేశారు. ఆ తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. ఒక మనిషి చనిపోవడం అనేది ఆయన చేతుల్లో లేకపోవచ్చు. కానీ ఆ మనిషి చనిపోయిన తర్వాత, 10-12 రోజుల వరకూ బాధిత కుటుంబానికి అతను భరోసా కల్పించలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది'' అని రేవంత్ రెడ్డి అన్నారు.


''అరెస్ట్ చేశారని అందరూ అడుగుతున్నారు తప్ప.. ఆయన వల్ల జరిగిన దుర్ఘనటనలో ఒక మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆ పిల్లాడు కోమాలో నుంచి బయటకు వచ్చాక కళ్ల ముందు తల్లి కనిపించకపోతే అతని పరిస్థితి ఏంటీ?, ఆ పేద కుటుంబం పరిస్థితి ఏంటీ అనేది ఒక్కరు కూడా ప్రశ్నించట్లేదు.  అల్లు అర్జున్ ఒక సినిమా యాక్టర్. సినిమాలు తీస్తున్నాడు.. డబ్బులు సంపాదిస్తున్నాడు. అంటూ సీఎం షాకింగ్ కామెంట్స్ చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: