ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కోళ్లకు వైరస్ విషయం టెన్షన్ పడుతోంది.  ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లా లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. దీంతో కోళ్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. వరుసగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.  పౌల్ట్రీ రైతులు ఆందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం  కీలకమైన సూచనలు చేస్తోంది.  బర్డ్ ఫ్లూ తేలినచోట చికెన్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. చుట్టు పది కిలోమీటర్ల పరిధిలో మెగా పెట్టి పర్యవేక్షిస్తున్నారు.


ఇక ఏపీతో పాటు తెలంగాణలోను కోళ్లలో వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పశు సంవర్థక అలర్ట్ అయింది. ఈ సందర్భంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ పశు సంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభసాచి ఘోష్ ఆదేశాలు జారీ చేశారు. పౌల్ర్టీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా వైరస్ సోకిన దూరంగా పూడ్చిపెట్టాలని స్పష్టం చేశారు. వాటిని తరలించే విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.


మరోవైపు ఉభయగోదావరి జిల్లాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా అన్ని అంగన్వాడి కేంద్రాలకు వారం రోజులపాటు కోడిగుడ్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.  అయితే కానూరు అగ్రహారం పరిధిలో మాత్రమే బర్డ్ ఫ్లూ అని తేలిందని.. మిగతా ప్రాంతాల్లో ఎక్కడా వెలుగు చూడలేదని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. చాలాచోట్ల కోళ్లు మృతి చెందినప్పటికీ.. అవి వేరే కారణాలతో గుర్తించినట్లు చెప్పుకొస్తున్నారు.  కోళ్ల మృత్యువాతతో ప్రజలు ఎటువంటి ఆందోళనలు చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు.


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలతో ఈ వైరస్ బతకదని చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే బర్డ్ ఫ్లూ కలకలం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోంది. దీంతో చాలామంది మాంసం గుడ్లను తిరస్కరిస్తున్నారు. అమ్మకాలు కూడా గణనీయంగా పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: