భారత్ లో అవినీతి అంతకంతకూ పెరుగిపోతుంది. ఏ ఏటికి ఆ ఏడు ర్యాంకింగ్ తగ్గాల్సి ఉన్నా మన దేశం మాత్రం అవినీతిలో దూసుకుపోతుంది.  తాజాగా 180 దేశాలకు సంబంధించినఅవినీతి సూచిలో భారత్ 96వ స్థానంలో నిలిచిందని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.  ర్యాంకింగ్ విడుదల కాగా.. అందులో భారత్ స్థానం మరింత దిగజారింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని అవినీతిని లెక్క కడుతూ.. భారత్ ర్యాంకింగ్ ను డిసైడ్ చేశారు. 2022లో భారత్ ర్యాంక్ 85గా ఉంటే.. 2023లో 93వ స్థానంలోకి దూసుకెళ్లింది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. 96వ స్థానానికి చేరుకుంది.  


గడిచిన రెండేళ్లలో అవినీతిలో మన దేశ ర్యాంక్ మరింత దిగజారింది. ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉందో నిపుణులు.. వ్యాపారవేత్తల అభిప్రాయాలు తీసుకొని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సున్నా నుంచి వంద మధ్య పాయింట్లను కేటాయించారు.  సున్నా అయితే అవినీతి ఎక్కువగా పేర్కొంటున్నారు. ప్రపంచంలో అవినీతి అత్యంత తక్కువగా ఉన్న దేశంగా డెన్మార్క్ తొలి స్థానంలో నిలవగా.. ఫ్లిన్లాండ్ రెండో స్థానంలో.. సింగపూర్ మూడో స్థానంలో నిలిచింది.  ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్.. లక్సంబర్గ్ నిలిచాయి. టాప్ 5 స్థానాల్లో ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు చోటు దక్కకపోవటమే కాదు.. సంపన్న దేశాలు లేకపోవటం గమనానార్హం.



కఠిన చట్టాలు ఉంటాయని చెప్పే సౌదీ అరేబియా లాంటి దేశాలు సైతం టాప్ 5 అవినీతి రహిత దేశాల జాబితాలో లేకపోవటం విశేషం. మనకు ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్థాన్.. శ్రీలంక.. బంగ్లాదేశ్ దేశాలు మనకంటే ఘోరమైన స్థానాల్లో ఉన్నాయి. మన కంటే కాస్త మెరుగైన స్థానంలో చైనా నిలిచింది. అత్యంత అవినీతి దేశంగా సౌత్ సూడాన్ నిలిచింది. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ అవినీతి ఒక సమస్యగా ఉందని.. అవినీతి పర్యావరణ చర్యలకు ప్రధాన ముప్పుగా మారిందన్న మాట.. ఆందోళనకు గురి చేసేదిలా ఉందని చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: