
తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో సారి భారీ శుభవార్త చెప్పింది. ఎందుకంటే ఈ సారి భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి తెరలేపింది. నోటిఫికేషన్ ఇచ్చేందుకు మార్గం క్లియర్ చేసింది. తెలంగాణలో గతేడాది నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఉద్యోగ భర్తీలను చేస్తూ ముందుకు సాగుతోంది. పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్లను క్లియర్ చేస్తూ వడివడిగా ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తోంది.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో భారీ ఉద్యోగాల జాతరకు రంగం సిద్దమైంది. తాజాగా అంగన్‌వాడీ టీచర్లు \హెల్పర్ల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల పైచిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వీటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఫిబ్రవరి 22న సంతకం చేశారు. దీంతో 6,399 అంగన్‌వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ పోస్టులు.. మొత్తం 14,236 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యలో.. కోడ్ ముగియగానే నోటిషికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు. ఈమేరకు కలెక్టర్ల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వనుఆన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత భారీ మొత్తంలో అంగన్‌వాడీ పోస్టులు భర్తీ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఖాళీలను భరీ‍్త చేస్తే అంగన్‌వాడీ కేంద్రాలు మరింత పటిష్టంగా మహిళలు, చిన్నారులకు సేవలు అందుతాయన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
తెలంగాణలో 140 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయా ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలను స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొత్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో ఒక టీచర్‌లోపాటు ఒక హెల్పర్ ఉంటారు. మినీ అంగన్‌వాడీ కేంద్రంలో ఒక టీచర్ మాత్రమే ఉంటారు. ప్రస్తుతం ప్రభుత్వం మినీ అంగన్‌వాడీ కేంద్రాలను కూడా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో వీటిలో కూడా ఆయాలను నియమించనున్నారు.