తెలంగాణ బడ్జెట్ భారీగానే ఉన్నప్పటికీ.. కేటాయింపులు లేకపోవడంతో అవి లెక్కలకే పరిమితమైపోయాయి.  ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నట్టు గొప్పగా చెబుతున్నప్పటికీ.. ఇప్పటికీ రుణమాఫీ కాని రైతులు ఎంతోమంది ఉన్నారు.  రైతులకు బోనస్ కూడా అంతంత మాత్రంగానే పడిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది.   ఇక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన పథకాల్లో సింహభాగం అమలుకు నోచుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.


తొలిసారిగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.  ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్థిక కష్టాలను క్లియర్ కట్ గా చెప్పేశారు. నెలవారీ వస్తున్న ఆదాయం ఎంత.. దేనికి ఎంత ఖర్చు అవుతుంది అభివృద్ధి సంక్షేమానికి నిధులపై మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు.



ఢిల్లీలో ప్రధానమంత్రి ని కలిసిన అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. వస్తున్న ఆదాయం గురించి వివరించారు.  22,500 కోట్లకు గానూ ప్రతీ నెలకు ప్రస్తుతం ఆదాయం 18,500 కోట్లు మాత్రమే వస్తోంది. ఉద్యోగుల వేతనాలకు 6,500 కోట్లు చెల్లిస్తున్నాం. వడ్డీలకు 6,800 కోట్లు కడుతున్నాం. మిగతా డబ్బును ప్రాజెక్టులు, ఇతర వాటి కోసం ఖర్చు చేస్తున్నాం.  రాష్ట్రం ఆదాయం ప్రతినెల 22 వేల కోట్లకు పెరిగే విధంగా కృషి చేస్తున్నాం. ఆర్థికపరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ పథకాల అమలును నిలిపివేయడం లేదు.  



గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల వడ్డీలకు దాదాపు 6,800 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఇది భారంగా ఉన్నప్పటికీ.. ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తున్నాం.. ఒక్క రూపాయి కూడా వృధాగా ఖర్చు చేయడం లేదు. అందువల్లే ప్రభుత్వపరంగా పథకాల అమలు వేగంగా జరుగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ ఆర్థికంగా అద్భుత ప్రగతి సాధిస్తోంది. ఇంకా కొన్ని కీలక ప్రాజెక్టులు కనుక పూర్తయితే తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: