ఆ డేంజర్ గేమ్ మన యువతను టార్గెట్ చేస్తోంది. ఆడిస్తూ అనంత లోకాలకు పంపిస్తోంది. చాపకింద నీరులా భయంకరంగా వ్యాపిస్తూ పిల్లల జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది. పబ్జీ పేరుతో విర్రవీగుతున్న ఆ గేమ్‌ను చావుదెబ్బతీయాల్సిన సమయం ఆసన్నమైంది.
![Image result for pubg game students playing](https://img-s-msn-com.akamaized.net/tenant/amp/entityid/BBMMs9W.img?h=404&w=624&m=6&q=60&o=f&l=f&x=2542&y=2106)
మన పిల్లల నిండు ప్రాణాలు తీస్తున్న పబ్జీ గేమ్ భయంకరంగా విజృంభిస్తోంది. పబ్జీ గేమ్ వ్యసనానికి తాజాగా మరో యువకుడు బలయ్యాడు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారంపల్లికి చెందిన సాగర్ అనే 20 ఏళ్ల యువకుడు పబ్జీ గేమ్ పిచ్చితో ప్రాణాలు కోల్పోయాడు. టైంపాస్‌గా ఆడటం ప్రారంభించిన సాగర్‌కు ఈ గేమ్ వ్యసనంలా మారింది. గత కొన్ని రోజులుగా పదేపదే ఈ గేమ్ ఆడటంతో అతని మెడనరాలు పట్టేసి ఆరోగ్యం విషమించింది. దీంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. గత 5 రోజులుగా వైద్యులు సాగర్‌కు చికిత్స అందించగా.. నరాలు పూర్తిగా దెబ్బతినడంతో గురువారం తుదిశ్వాస విడిచాడు. ఇక పబ్జీ గేమ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సాగర్‌ను చూపిస్తూ.. అతని స్నేహితులు ఓ అవేర్నెస్ వీడియోను కూడా రూపొందించారు.
![Jagityal Youth Died For Playing Pubg Game - Sakshi](https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/03/22/sargar-final.jpg?itok=hHxSzSid)
పబ్జీ గేమ్ ఆడటం ఎంత ప్రమాదకరమో సాగర్ పరిస్థితి చూసి తెలుసుకోండని ఆ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పబ్జీ మహమ్మారికి యువత బానిస అవుతోంది. ఈ గేమ్ వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రహారాలు మాని అనారోగ్యానికి గురవ్వడమే కాకుండా.. చదువు, చేసే పనిపై శ్రద్ద చూపించలేకపోతున్నారు. ఓ స్టూడెంట్ పరీక్షలో ఎకనామిక్స్ సూత్రాలకు బదులు పబ్ జీ వ్యాసం రాసిన విషయం తెలిసిందే. తాను గేమ్ ఆడటం మానేసినా.. దానికి సంబంధించిన చిత్రాలు వదలడం లేదని, పబ్జీ ఎంత ప్రమాదకరమో ఇప్పుడు అర్థమైందని ఆ యువకుడు తెలిపాడు.
![Related image](https://www.hindustantimes.com/rf/image_size_960x540/HT/p2/2018/09/02/Pictures/pokemon-go_9e012da4-aed7-11e8-abd2-5c322fa89f61.jpg)
విద్యార్థుల ప్రాణాలతోనూ చెలగాటం
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు వ్యసనంగా మారిన ఈ గేమ్ చాలా మంది విద్యార్థుల ప్రాణాలతోనూ చెలగాటమాడుతోంది. విద్యార్థులు తమ చదువులు సైతం పక్కనపెట్టి పబ్జీ ఆటలో మునిగి తేలుతున్నారు. మొన్నటికి మొన్న పబ్జీ ఆడుతూ ఒక యువకుడు మంచినీళ్లను కొన్ని ఆసిడ్ తాగితే, దేశంలో పలు చోట్ల పబ్జీ ఆడొద్దని తల్లిదండ్రులు ఆంక్షలు పెట్టారని యువకులు ఆత్మహత్య చేసుకొని తిరిగిరాని లోకాలకు చేరిపోయారు. యువతకు వ్యసనంగా మారిన ఈ గేమ్‌ను నిషేంధించాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
ఎంతలా ఆకర్షిస్తుందంటే..
పబ్జీ గేమ్ ని ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది ఆడుతున్నారని అంచనా. రోజులో ఏ సమయంలో చూసినా కనీసం మూడు, నాలుగు కోట్ల మంది ఆన్లైన్ గేమ్ లోనే ఉంటారు. పబ్జీ గేమ్ లో తనకు ఆడే స్కోప్ ఇవ్వలేదని ఓ ఆటగాడు మరో ఆటగాడిని ఇంటికెళ్లి మరీ చావగొట్టాడు.. జమ్మూ కశ్మీర్ పబ్జీ గేమ్ కి బాగా ఎఫెక్ట్ అయ్యింది. అక్కడ పదో తరగతి ఫలితాలు దారుణంగా రావడంతో గేమ్ ను రాష్ట్రంలో నిషేధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇక గుజరాత్ లోనూ దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. అక్కడ స్కూళ్లలో ఈ గేమ్ ను నిషేధించారు. పిల్లలు స్కూళ్లకు మొబైల్స్ తీసుకు రాకూడదని ఆదేశించారు. అసలీ గేమ్ ను దేశంలోనే నిషేధించాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. హాస్టళ్లలో, తల్లిదండ్రుల నియంత్రణలోలేని పిల్లల్లో పబ్జీ ఓ భయంకర వ్యసనంలా మారుతోంది. చదువు మానేసి ఈ గేమ్ లోనే మునిగి తేలుతున్నారు. తినడం, పడుకోడం, దైనందిన కార్యకలాపాలు సైతం మానేసి గేమ్ ధ్యాసలో పడి మునిగి తేలుతున్నారు. జమ్మూ కశ్మీర్ లో ఈ గేమ్ ఆడి ఆడి ఒక్కసారి కూడా గెలవని ఓ యువకుడు పిచ్చి వాడిలా మారిపోయాడు.. డిప్రెషన్ లోకి వెళ్లి రోడ్ల వెంట తిరుగుతూ.. చేతిలో గన్ ఉందన్న ఫీలింగ్ లో స్వైర విహారం చేశాడు. ఈ గేమ్ ఆడే వారికి రకరకాలుగా శరీరక, మానసిక సమస్యలు ఎదరవుతున్నాయి. స్కూలు పిల్లల శారీరక, మానసిక వికాసంపై దెబ్బ కొడుతున్న ఈ గేమ్ ను దేశంలోనే నిషేధించాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ పోరాడుతోంది.
ఫ్రెండ్స్.. మనం కూడా సోషల్ మీడియా వేదికగా ఈ గేమ్‌ను బ్యాన్ చేయాలంటూ ఉద్యమిద్దాం. మన పిల్లలు ఇలాంటి పిచ్చి గేమ్‌ల బారిన పడకుండా కాపాడుకుందాం.