ఇటీవలే సీఎం జగన్ మోస్ట్ పాపులర్ సీఎం జాబితాలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల్లో నాల్గవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే జగన్ నెంబర్ -1 స్థానంలోకి వెళ్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా ముందు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జూమ్, సోషల్ మీడియా రాజకీయాలు చేస్తున్నారని, ప్రజాక్షేత్రంలో జగన్ అనే వ్యక్తిని.. చంద్రబాబు ఎదుర్కోలేరని తెలిసిపోయిందన్నారు. 

 

ఏపీలో గ‌త నాలుగు నెల‌లుగా క‌రోనా ప్రార‌భం ముందు నుంచే అధికార వైసీపీ వ‌ర్సెస్ విప‌క్ష టీడీపీ శ్రేణుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వాదోప‌వాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వైసీపీలో కొంద‌రు మంత్రులు టీడీపీపై బాగా కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్‌గానే ఉన్నాయని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది కాలంలో చంద్రబాబు ఎక్కువగా సోషల్ మీడియా, జూమ్ యాప్‌లోనే రాజకీయాలు చేశారు. అక్కడ నుంచి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 

 

అసలు ప్రజల్లో తిరగకుండా జగన్ ప్రభుత్వం మీద ఓ నెగిటివ్ పెరిగిపోయిందనే ప్రచారం చేశారు. కానీ ప్రజల్లో అలాంటి భావన ఏమి లేదు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు సంతోషంగానే ఉన్నారు. జగన్ పాలన పట్ల వారు సంతృప్తిగానే ఉన్నారు. ఓ వైపు క‌రోనా నేప‌థ్యంలో ఇంత హ‌డావిడి జ‌రిగితే చంద్ర‌బాబు ఆయ‌న త‌న‌యుడు లోకేష్ ఏపీకి రాకుండా హైద‌రాబాద్ కే ప‌రిమితం అయ్యారు. చివ‌ర‌కు పార్టీ పెద్ద పండ‌గ అయిన మ‌హానాడు ను సైతం జూమ్ యాప్‌లో చేసుకోవాల్సి వ‌చ్చింది.

 

మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అన్ని రంగాల్లో దూసుకు పోవ‌డంతోనే ఆయ‌న‌కు దేశంలోనే నాలుగో ఉత్త‌మ సీఎంగా ర్యాంకు సొంత‌మైంది. ఇక ఇది ఓర్వలేకే బాబు అండ్ బ్యాచ్ సోషల్ మీడియాలో పనికిమాలిన రాజకీయం చేస్తుందని అర్ధమవుతుంది. ఏదేమైనా ప్రజాక్షేత్రంలో చంద్రబాబు...జగన్‌ని ఎదుర్కోవడం కష్టమనే అర్ధమవుతుంది. ప్రస్తుతం దేశంలోనే టాప్ సీఎంగా నాలుగో స్థానంలో ఉన్న జగన్...త్వరలోనే నెంబర్ వన్ స్థానం అందుకోవడం సులువే అనుకుంటా..!

మరింత సమాచారం తెలుసుకోండి: