వాళ్లు బిజెపి నాయకులు అయినా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. బిజెపిలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ఈగ వాలనివ్వకుండా చూసుకుంటూ ఎప్పటికప్పుడు కేంద్రంలో జరిగే పరిణామాలను చంద్రబాబు చెవిన పడేస్తుంటారు అనే ఆరోపణలు ఎదుర్కుంటూ వస్తున్నవారే. వీరిలో ఒకరు రాజ్యసభ సభ్యుడు కాగా, మరొకరు తెలుగుదేశం ప్రభుత్వం లో బిజెపి తరఫున మంత్రిగా పని చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తులతో రాజ్యాంగ పదవిలో ఉన్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అవ్వడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి మరో వ్యక్తి నియమించిన సమయంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు చాలానే విమర్శలు చేశారు.

IHG


 రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై విమర్శలు చేయడమే తప్పు అయితే, ఆయనను అల్లరి పాలు చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. వారు చెప్పినట్టుగానే రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు రాగద్వేషాలకు అతీతంగా, నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. అందులోనూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటే అన్ని పార్టీలను సమానంగా చూస్తూ, నిబంధనల మేరకు నడుచుకోవాలి. అలా కాకుండా కేవలం కొన్ని పార్టీలకు మేలు చేసేలా, మరికొన్ని పార్టీలు వ్యవహరిస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయో రమేష్ కుమార్ వ్యవహారంలో చూస్తూనే ఉన్నాం. 


మొదటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై వైసిపి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూనే వస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని, ఆయన కుమార్తె టిడిపి ప్రభుత్వ హయాంలో బాగా లభ్ది పొందారని, ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు. అదీ కాకుండా సామాజిక వర్గం లెక్కలు కూడా బయటకు తీశారు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు పెరిగిపోయాయి. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి చౌకబారు విమర్శలు ఎలా చేస్తున్నారంటూ మిగతా రాజకీయ నాయకులు మండిపడ్డారు. కానీ ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిజెపికి చెందిన చంద్రబాబు అనుకూల వ్యక్తులుగా ముద్రపడ్డ వారితో అంతంత రహస్యంగా ఈ నెల 13 న  భేటీ అవ్వడం వెనుక కారణాలు ఏమిటో తెలియడం లేదు.


 ఇప్పుడు అందరూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వేలెత్తి చూపిస్తున్నారు. వైసీపీ చేసిన ఆరోపణల్లో నిజం ఉందని, అసలు అంత రహస్యంగా ఆ ఇద్దరు నాయకులతో ప్రైవేట్ హోటల్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఉంది. ఎందుకంటే వైసిపి ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఈ తరహా విమర్శలు చేస్తూనే ఉంది. కోర్టులో కూడా ఈ వ్యవహారం నలుగుతోంది. ఈ సమయంలో ఆయన ఈ విధంగా వ్యవహరించడం ఆయనకు తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి కూడా ఇబ్బందికర పరిణామాలే. 


ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. లేకపోతే వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని అందరూ ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వ్యవహారం పై అసలు నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారో, టీడీపీ ఎలా స్పందిస్తుందో ? నిమ్మగడ్డతో భేటీ అయిన బీజేపీ నాయకులు స్పందన ఏంటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: