ఏపిలోని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాస్ సంస్ధలు ఆసక్తిని చూపుతున్నాయి.  పెట్టుబడులు పెట్టటానికి జపాన్ దాదాపు 10 సంస్ధలు రెడీగా ఉన్నాయి.  పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో జపాన్ సంస్ధల అధిపతులు వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడినపుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి తమకున్న ఆసక్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ సమస్య  తగ్గిన వెంటనే రాష్ట్రానికి వచ్చి క్షేత్రస్ధాయిలో మిగిలిన వ్యవహారాలు ఏర్పాటు చేసుకోవటానికి రెడీ అని చెప్పటం గమనార్హం.

 

బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఆఫ్ జపాన్, జపాన్ ప్రీమియర్ ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూట్,  జపాన్ కో ఆపరేటివ్ ఇంటర్నేషన్ ఏజెన్సీ, ప్రీమియర్ జపాన్ డెవలప్మెంట్ ఏజెన్సీ, కునియమి ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఏపిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు మంత్రితో చెప్పాయి.

 

నిజానికి మనదేశంలో పెట్టుబడులు పెట్టటానికి జపాన్ కన్నా చైనా కంపెనీలే ఎక్కువ ఇంట్రస్టు చూపిస్తుంటాయి. అందుకనే చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే డ్రాగన్ కంపెనీలు చాలా ప్రాజెక్టులను చేజిక్కించుకున్నాయి. రెండుదేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా దేశంలో చైనా వ్యతిరేకత పెరిగిపోతోంది. దాంతో ప్రజాగ్రహానికి తలొంచిన చాలా రాష్ట్రాలు చైనా కంపెనీలకిచ్చిన కాంట్రాక్టులను రద్దు చేస్తున్నాయి.  దీన్ని అవకాశంగా తీసుకున్న జపాన్ కంపెనీలు రాష్ట్రంలోని అనేక రంగాల్లో తాము పెట్టుబడులు పెట్టడానికి డిసైడ్ అయ్యాయి. ఇందుకు అవసరమైన సాంకేతిక అంశాలను వీలైనంత తొందరలోనే పూర్తి చేసుకోబోతున్నట్లు సమాచారం.

 

పోర్టుల నిర్మాణం, పోర్టు ఆధారిత క్లస్టర్ల నిర్మాణం-అభివృద్ధి, ఇండస్ట్రియల్ క్లస్టర్ల అభివృద్ధిలో పెట్టుబడులకు బాగా ఆసక్తి చూపుతున్నాయి.  అలాగే సోలార్ విద్యుత్ పార్కుల ఏర్పాటు-అభివృద్ధి, ఆక్వాకల్చర్, ఎలక్ట్రిక్  వాహనాల తయారీ, అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, పట్టణాల అభివృద్ధి, పునరుద్ధరణతో పాటు అనేక రంగాల్లో పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయి. రామాయపట్నం పోర్టు నిర్మాణం- అభివృద్ధి, విశాఖపట్నం సమీపంలోని నక్కపల్లి ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ధి, 10 వేల మెగావాట్ సామర్ధ్యమున్న సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు తదితరాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి.

 

ఒక్కసారిగా ఏపిలో పెట్టుబడులు పెట్టటానికి జపాన్ ఇంత ఆసక్తి చూపటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే చైనా కంపెనీలకు యావత్ దేశంలో కంట్రాక్టులను రద్ద చేస్తుండటమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ ప్రాజెక్టులను దక్కించుకున్న చైనా కంపెనీలకు పై ప్రభుత్వాలు షాకిచ్చాయి. ఇందులో భాగంగానే ఏపిలో కూడా ప్రభుత్వం చైనా కంపెనీలకు ఎటువంటి కాంట్రాక్టులు ఇవ్వదలచుకోలేదు. ఆ విషయాలు గ్రహించే జపాన్ కంపెనీలు తమంతట తాముగా పెట్టుబడులు పెట్టటానికి ముందుకొస్తున్నాయి.

 

ఇప్పటి పరిస్ధితుల్లో ఒక్క మనదేశంలో మాత్రమే కాదు చాలా దేశాల్లో చైనాపై మండిపోతున్నాయి. చైనాపై ఇతర దేశాలు మండిపోవటానికి ప్రధానకారణం కరోనా వైరస్ ప్రపంచానికి అంటించిదనే. కాబట్టి ఇతర దేశాల్లోని పెట్టుబడులకు, కంపెనీల ఏర్పాటుకు కూడా డ్రాగన్ దేశానికి షాకులు తప్పేట్లు లేదు. కాబట్టి ఈ పరిస్ధితుల్లో వస్తున్న అవకాశాన్ని గనుక మన రాష్ట్రం ఉపయోగించుకుంటే జపాన్ నుండి వచ్చే అవకాశం ఉన్న పెట్టుబడులతో పాటు ఇతర దేశాల నుండి కూడా పెట్టుబడులు వచ్చే అవకాశాలుండటంతో  అభివృద్ధి  శరవేగంగా జరగటం ఖాయమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: