’బీసీ నాయకత్వంపై కుట్ర’ ఇది తాజాగా చంద్రబాబునాయుడు మొదలుపెట్టిన గోల. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సామాజికవర్గానికి, టిడిపికి ఎటువంటి సంబంధంలేదని. తెలుగుదేశంపార్టీ నేతలను అరెస్టులు చేస్తే, కేసులు పెడితే వాటిని టిడిపి నేతల అరెస్టులు, కేసులుగానే చూడాలికానీ సామాజికవర్గాన్ని రాజకీయాల్లోకి లాగడం ఎంతమాత్రం తగదు. కానీ చంద్ర గోలెందుకంటే మాజీమంత్రి కొల్లు రవీంద్ర మీద హత్యానేరంలో కేసు నమోదు చేసి పోలీసులు  అరెస్టు చేశారట. అలాగే మరికొందరు టిడిపిలో ఉన్న బిసి నేతలపై కావాలనే కేసులు పెట్టారంటూ చంద్రబాబు యాగీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బిసి బాబు రాజకీయమే ఇంత చవకబారుగా ఉంటుంది కాబట్టే సామాజికవర్గాన్ని వివాదంలోకి లాగుతున్నాడు.

 

మాజీమంత్రి అచ్చెన్నాయుడు విషయమే తీసుకుంటే రూ. 157 కోట్ల ఇఎస్ఐ కుంభకోణంలో ప్రధాన సూత్రదారిగా నిరూపితమైంది. అప్పటి ఇఎస్ఐ డైరెక్టర్లను, ఉన్నతాధికారుల పై  ఒత్తిడి తెచ్చి అడ్డుగోలు అక్రమాలకు పాల్పడ్డాడని ఏసిబి ఆధారాలతో  సహా రుజువుచేసింది.  అచ్చెన్నతో పాటు అరెస్టయిన వారు కూడా మాజీమంత్రే  ప్రధాన సూత్రదారిగా చెప్పారని సమాచారం. ఇక్కడ అచ్చెన్న అరెస్టు విషయం కన్నా అవినీతి జరిగిందా ? లేదా ? జరిగితే సూత్రదారి ఎవరు అన్నదే ప్రధానం. ఇక మరో మాజీమంత్రి  కొల్లు రవీంద్ర అరెస్టు విషయం తీసుకున్నా మోకా భాస్కరరావు హత్యలో పాత్రదారులు వేరే అయినా సూత్రదారుడు రవీంద్రే అని పోలీసులు ప్రకటించారు.

 

కొల్లు ఇచ్చిన మద్దుతోనే తాము మోకాను హత్య చేసినట్లు నిందుతులు అంగీకరించినట్లు పోలీసులు ప్రకటించారు. నిందుతుల వాజ్ఞూలం ప్రకారమే తాము కొల్లుపై కేసు పెట్టినట్లు చెప్పటం గమనార్హం. ప్రధాన నిందుతుడు చింతా చిన్ని-కొల్లు మధ్య జరిగిన మొబైల్ కాల్ హిస్టరీని కూడా పోలీసులు సంపాదించినట్లు సమాచారం. ఎప్పుడైతే మోకా హత్య జరిగిందో వెంటనే నిందుతులతో పాటు కొల్లు కూడా పారిపోయేందుకు ప్రయత్నించటంతో మాజీమంత్రి పాత్రపై  అనుమానాలు పెరిగిపోయాయి. అలాగే మరో మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదు విషయంలో కూడా చంద్రబాబు గోల చేయటమే విచిత్రంగా ఉంది. చింతకాయలపై ఎవరూ నిర్భయ కేసు పెట్టలేదు. ఆయన నోటీదురుసు వల్లే కేసు నమోదైందని అందరికీ తెలుసు.

 

నర్సీపట్నం మున్సిపల్ ఆఫీసులో తన తాత లచ్చాపాత్రుడి ఫొటోను తీసేయటంపై మండిపోయిన అయ్యన్న  కమీషనర్ తోట కృష్ణవేణి పై మండిపోయాడు. ఫొటోను మళ్ళీ యధాస్ధితిలో పెట్టకపోతే బట్టలూడదీసి  కొడతానంటూ అందరిముందు బహిరంగంగా దూషించాడు. దాంతో కమీషనర్ చేసిన ఫిర్యాదు ప్రకారమే పోలీసులు నిర్భయ కేసు పెట్టారు. ఇందులో పోలీసులు అయ్యన్నను ఇరికించిందేమీ లేదు. చివరగా మాజీమంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పపై కేసు తీసుకున్నా తమంతట తాముగా పోలీసులు వీళ్ళపై కేసులు పెట్టలేదు. మాజీ ఎంఎల్ఏ పిల్లి అనంతలక్ష్మి కొడుకు రెండో పెళ్ళి వివాదంలో బాధితురాలైన(ఎస్సీ) ఎంఎల్ఏ కోడలు చేసిన ఫిర్యాదు ప్రకారమే మాజీమంత్రులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు పెట్టారు పోలీసులు.

 

నిజానికి పై కేసుల్లో దేనితోను బిసి సామాజికవర్గానికి ఎటువంటి సంబంధం లేదని అర్ధమైపోతుంది. ఇదే విషయాన్ని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు స్పష్టంగా ప్రకటించాడు. అవినీతిలోను, హత్యలు తదితరాల్లో ఇరుక్కున్న వాళ్ళకి సామాజికవర్గంతో ఎటువంటి సంబంధం లేదని చెప్పినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు. ఇపుడు అరెస్టులయిన వారు, కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు అధికారంలో ఉన్నపుడు ఎప్పుడు కూడా బిసి సామాజికవర్గం సంక్షేమంపై నోరిప్పిన దాఖలాల్లేవు.  కానీ చంద్రబాబు మాత్రం బిసి నాయకత్వం అంటూ గోల చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: