ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు సీన్ అర్ధమైపోయినట్లుంది. అందుకనే రోజురోజుకు చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రభుత్వం నుండి గవర్నర్ కు అందిన రెండు ప్రతిష్టాత్మక బిల్లులకు బహుశా బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వం పంపించిన రెండు బిల్లులు అభివృద్ధి వికేంద్రీకరణకు ఉద్దేశించిన మూడు రాజధానుల ఏర్పాటు, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు గవర్నర్ పరిశీలనలో ఉన్నాయి. వాటిని ఆమోదిస్తు గవర్నర్ సంతకం చేయటం బహుశా లాంఛనమే అనుకుంటున్నారు. గవర్నర్ సంతకం చేయకుండా రెండు బిల్లులను ఎలాగైనా ఆపాలని చంద్రబాబుతో పాటు బిజెపి, సిపిఐ అగ్రనేతలు శక్తిమేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంతవరకూ సఫలమవుతారో డౌటనుమానమే.
టిడిపి భవిష్యత్తు మొత్తం అమరావతి మీదనే ఆధారపడుంది. నిజానికి రాజధానిగా అమరావతి ఏర్పాటే ఏకపక్షంగా జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటికే రాజధాని ఏర్పాటుపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటి నివేదికను కాదని చంద్రబాబే సొంతంగా వ్యాపారస్తులతో ఓ కమిటి వేశాడు. ఆ కమిటి ద్వారా అమరావతిని రాజధానిగా చేసుకోవాలని చెప్పించుకున్నాడు. ప్రతిపక్షాలతో కానీ జనాభిప్రాయంతో కానీ సంబంధం లేకుండానే అసెంబ్లీలో అమరావతిని చంద్రబాబు రాజధానిగా ప్రకటించాడు. పోనీ రాజధానిని ఏకపక్షంగా నిర్ణయించినా వాస్తవ పరిస్ధితులను అర్ధం చేసుకుని రాజధాని నిర్మాణం చేశాడా అంటే అదీలేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నగరాన్ని నిర్మించాలనే భ్రమల్లో ముణిగిపోయాడు. దాంతో రాజధాని నిర్మాణమే చివరకు అటకెక్కేసింది.
రాజధాని నిర్మాణం పేరుతో గ్రాఫిక్కులను తయారుచేసి జనాలు మోసం చేశాడు. ఏదో తూతూ మంత్రంగా తాత్కాలికంగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మించాడు. నిర్మించిన భవనాలేమైనా మంచి నాణ్యతగా చేశాడా అంటే అదీలేదు. అంతా నాసిరకం కట్టడాలే. చిన్న వర్షం వస్తే అన్నీ భవనాల్లోను కురుస్తుంది. ఎప్పటికప్పుడు అంచనా వ్యయాలను పెంచుకుంటు పోయి వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు. మొత్తంమీద రాజధాని నిర్మించేందుకు వచ్చిన అవకాశాన్ని చేతులారా చెడగొట్టుకున్నాడు చంద్రబాబు. చివరకు మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అంటే కసి పెంచుకున్నాడు. దానికి తగ్గట్లే రాజధాని నిర్మాణంపై లక్షల కోట్లు ఖర్చుచేసే పరిస్ధితి లేదని చెప్పి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్ వైజాగ్ ను ఎంపిక చేశాడు. తక్కువ ఖర్చుతోనే రాజధానిగా వైజాగ్ ను మరింత అభివృద్ధి చేయొచ్చన్నది జగన్ ఆలోచన.
ఎప్పుడైతే రాజధాని అమరావతి నుండి వైజాగ్ తరలిపోవటం ఖాయమని అర్ధమైపోయిందో అప్పటి నుండి చంద్రబాబు, యనమల అబద్ధాలు చెప్పటం మొదలుపెట్టారు. కేంద్రం అనుమతితోనే అమరావతిని రాజధానిగా నిర్ణయించినట్లు చంద్రబాబు చెప్పిందంతా అబద్ధమే. రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్రే లేదని ఎప్పుడో కేంద్రం స్పష్టం చేసిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నాడు. అలాగే శివరామకృష్ణన్ చెప్పినట్లే తాము అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు చెబుతున్నది కూడా అబద్ధమే. గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్య రాజధాని వద్దే వద్దని కమిటి నెత్తీ నోరు మొత్తకున్న విషయం అందరికీ తెలిసిందే.
శాసనమండలిలో సెలక్డ్ కమిటి పరిశీలనలో బిల్లులు ఉన్నట్లు చెబుతున్నది కూడా అబద్ధమే. అసలు సెలక్ట్ కమిటీయే ఏర్పాటు కాలేదు. బిల్లులను మండలిలో ప్రవేశపెడితే చాలు చర్చ జరిగినా, జరగకపోయినా, ఆమోదం పొందినా, తిరస్కరించినా కూడా నిబంధనల ప్రకారం కొద్దిరోజుల తర్వాత పాసైపోయినట్లే. ఆ రూలు ప్రకారమే బిల్లులను ప్రభుత్వం ఇపుడు గవర్నర్ ఆమోదానికి పంపింది. ఆ విషయంలోనే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. గవరర్నర్ ఆమోదం తెలిపి, జగన్ వైజాగ్ వెళ్ళిపోతే టిడిపి భవిష్యత్ దాదాపు మూసుకుపోయినట్లే అనుకోవాలి.