ఏ రంగంలో అయినా అనుభవం వచ్చేకొద్దీ దాన్ని పదిమంది మంచికి ఉపయోగించాలని అనుకుంటారు. కానీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు తన అనుభవాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నాడు ? దేనికంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లటానికి, తనకు పాపులారిటీ తెచ్చుకోవటానికి మాత్రమే ఉపగించుకుంటున్నాడు. వ్యవస్ధల్లోని లొసుగులను మ్యానేజ్ చేసుకోవటం, మెజారిటి మీడియాను గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యర్ధులపై బురదచల్లించటం, ఎన్నికల సమయంలో జనాలను మాయ చేయటానికి తప్ప తన అనుభవం ఇంక దేనికీ పనికిరాలేదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. దీనికి నిదర్శనమే మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం.
గట్టి ప్రత్యర్ధి ఎదురైనపుడు, జనాల్లో వివేకం మేల్కొన్నపుడు తనకు పరాభవం తప్పదని చంద్రబాబుకు ఈపాటికే తెలిసివచ్చుండాలి. కానీ ఘోరంగా ఓడిపోయినా తన పంథాను మాత్రం చంద్రబాబు మార్చుకోవటానికి ఇష్టపడటం లేదు. ఇందులో భాగమే గవర్నర్ బిశ్వజిత్ హరిచందన్ కు రాసిన తాజా లేఖ. అధికార వికేంద్రీకరణ @ మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును వ్యతిరేకిస్తు చంద్రబాబు గవర్నర్ కు రాసిన లేఖలో చాలా వరకూ అబద్ధాలే. గవర్నర్ కు రాసిన లేఖను చూస్తే చంద్రబాబు బెదిరిస్తున్నాడా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూడు రాజధానులను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు, గవర్నర్ దగ్గరకు చేరిన బిల్లులు ఏ విధంగా రాజ్యంగా వ్యతిరేకం ? లాంటి అంశాలు పూర్తిగా అబద్ధాలే.
నిజంగానే నియమ, నిబంధనల ప్రకారమే తాను అమరావతి నిర్మాణానికి పూనుకుని ఉంటే ఏదో విధంగా తన హయాంలోనే రాజధానిని నిర్మించేసుండేవాడే. కానీ ప్రపంచ అత్యద్భుత రాజధాని నగరం నిర్మాణం పేరుతో జనాలను మోసం చేయాలని చూశాడు కాబట్టే చివరకు నాలుగు నాసిరకం కట్టడాలు కట్టొదిలిపెట్టాడు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి తర్వాత రాజధానిగా అమరావతిని డిసైడ్ చేశాడన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులపై కేసులు పెట్టించటం, పంటలు తగలబెట్టించటం లాంటివి చేశాడు కాబట్టే మంగళగిరిలో పోటి చేసిన కొడుకు నారా లోకేషే ఓడిపోయాడు. అమరావతిని ఓ విధంగా కమ్మోళ్ళ గేటెడ్ కమ్యూనిటిగా మార్చేయాలని చాలా ట్రై చేశాడు. కానీ జనాలిచ్చిన తీర్పుతో సాధ్యంకాలేదు.
దశాబ్దాలుగా అభివృద్ధి మొత్తాన్ని హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కలే కేంద్రీకరించిన కారణంగా విభజన సమయంలో సీమాంధ్ర ప్రాంతం ఎంతగా నష్టపోయిందో అందరూ చూశారు. కానీ చంద్రబాబు మాత్రం మళ్ళీ సీమాంధ్ర అభివృద్ధి మొత్తాన్ని మళ్ళీ అమరావతి+చుట్టు పక్కలే కేంద్రీకరించాలని చూడటంతోనే ఆయన అనుభవం ఎంతటిది జనాలకు తెలిసిపోయింది. రాష్ట్రాదాయం మొత్తం తెచ్చి అమరావతిని డెవలప్ చేస్తే సరిపోతుందని చంద్రబాబు డిసైడ్ అయ్యాడు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో జనాలు గట్టిగా బుద్ధి చెప్పారు. అయినా చంద్రబాబు మాత్రం తన బుద్ధిని మార్చుకోవటానికి ఇష్టపటం లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి నోచుకోకపోయినా ఐదేళ్ళు పట్టించుకోలేదు. ఐదేళ్ళ వెనకబాటును జగన్మోహన్ రెడ్డి సరిచేద్దామని చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు అడ్డుకుంటున్నాడు.
జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు జనాలకు ఏ మేరకు ఉపయోగపడుతుందన్న విషయాన్ని చూడకుండా తనకెంత నష్టం జరుగుతుందనే లెక్కలేసుకుంటున్నాడు. అయితే జగన్ ప్రతి నిర్ణయం తనకు తీరని నష్టం చేస్తుందని తేలుతుండటంతో ఏమి చేయాలో అర్ధంకాని చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. మొత్తం మీద తన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తనకు, తన వాళ్ళకు తప్ప రాష్ట్రాభివృద్ధికి పెద్దగా ఉపయోగపడదని తేలిపోయింది.