ఆంధ్రప్రదేశ్ తీరంలో మరోసారి తుపాను అలజడి రేగుతోంది. పశ్చిమ ఉత్తర బంగాళాఖాతం ప్రాంతములో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ బంగా - బంగ్లాదేశ్ తీరాలకు దగ్గరలో ఇది కొనసాగుతోందని తుపాను హెచ్చరికల కేంద్రం విశాఖపట్నం వారు తెలియజేస్తున్నారు. దీనికి అనుబంధముగా  7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తుపాను హెచ్చరికల కేంద్రం విశాఖపట్నం చెబుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొలది నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఇది రాగల 24 గంటలలో  మరింత బలపడే అవకాశం ఉంది.


ఈ అల్పపీడనం కారణంగా.. దీని ప్రభావంతో రానున్న 24గంటల్లో ఉత్తర కోస్తాఆంధ్ర, యానాం ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరువులతో వర్షాలు ఉండే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం విశాఖపట్నం  చెబుతోంది. రానున్న 24గంటల్లో రాష్ట్ర తీరం వెంబడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గాలుల వేగం గంటకు 50-60కి.మీ. ఉండగా, ఉత్తర కోస్తాంధ్ర తీరంలో వీటి వేగం గంటకు 40-50కి.మీ ఉండే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో ఏపీ తీరం వెంబడి చేపలవేట వద్దని మత్స్యకారులకు సూచనలు  తుపాను హెచ్చరికల కేంద్రం విశాఖపట్నం వారు హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ ఉత్తర బంగాళాఖాతం ప్రాంతములో  ఇలాంటి అల్పపీడనాలు సాధారణంగానే ఏర్పడుతుంటాయి.


అయితే.. ఇది పశ్చిమ బంగా - బంగ్లాదేశ్ తీరాలకు దగ్గరలో ఇది కొనసాగుతోందని తుపాను హెచ్చరికల కేంద్రం విశాఖపట్నం వారు చెప్పడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు  7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పడం వల్ల జాలర్లు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదని వాతారవణ శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. ఇది రాగల 24 గంటలలో  మరింత బలపడే అవకాశం ఉందని చెప్పడం వల్ల అప్రమత్తత అవసరంగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: