నేల విడిచి సాము చేసినట్లుగా
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారం కనిపిస్తోంది. ప్రభుత్వంలోని లోటుపాట్లను ఎత్తి చూపించడం ప్రధాన ప్రతిపక్షం బాధ్యత. ప్రజలకు మేలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందా లేదా అనేది చూడడం, ప్రజల సమస్యల విషయంలో గొంతెత్తి పోరాటం చేసి ప్రభుత్వం సక్రమంగా పనిచేసేలా చేయడం ప్రధాన ప్రతిపక్షంగా
తెలుగుదేశం పార్టీ బాధ్యత. కానీ చిన్న దానికి పెద్ద దానికి అదే పనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ప్రజలకు మేలు జరిగే విషయాల్లోనూ రాజకీయం చేస్తూ, అంతిమంగా ప్రజలు, రాష్ట్రం ఇలా అంతా నష్టపోయే విధంగా వ్యవహరించడం వంటి చర్యలతో
తెలుగుదేశం పార్టీ అప్రదిష్ట మూట కట్టుకుంటూ వస్తోంది. ముఖ్యంగా పేదలకు ప్రభుత్వం ఇవ్వ తలపెట్టిన ఇళ్ల స్థలాలు పంపిణీ విషయమే కావచ్చు, మరికొన్ని విషయాల్లోనూ, కోర్టుకెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ కు వేయించి, ప్రజలకు మేలు జరగకుండా అడ్డుకోవడం వంటి చర్యలు ప్రధాన ప్రతిపక్షం
టిడిపి విఫలమవుతోంది అనే అభిప్రాయం కలిగేలా చేస్తున్నారు.
ఏపీ సీఎంగా
జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగిందనేది అందరూ తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిన వాస్తవం. అలాగే తొలి ఏడాది పరిపాలనా కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఇప్పటికీ వాటిని ఎటువంటి ఆటంకం లేకుండా అమలు చేసి చూపిస్తూ, దేశవ్యాప్తంగా
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టను మూటు కట్టుకుంటూ వస్తోంది. కానీ అదే సమయంలో దేశవ్యాప్తంగా
ఏపీ పరువు తీసే విధంగా, ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తోందనే విమర్శలు ఇప్పుడు పెద్దఎత్తున వస్తున్నాయి. ప్రతి దశలోనూ
టిడిపి అధినేత చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం విఫలమైందని, చేతకాకపోతే ప్రభుత్వం దిగిపోవాలని, అదే తమకు అవకాశం ఇస్తే ఇంతకంటే మంచి పరిపాలన అందిస్తామంటూ పదేపదే చెప్పుకుంటూ వస్తున్నారు.
గత ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో ఎందుకు ఈ స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు అని, ఇన్ని సంక్షేమ పథకాలను ఎందుకు ప్రవేశం పెట్టలేకపోయారని అధికార
పార్టీ ప్రశ్నిస్తోంది. అయినా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో
టిడిపి నాయకులు ఉన్నారు.
అమరావతి పేరు చెప్పి చేసిన హంగామా అంతా ఇంత కాదు.
అమరావతి అంటూ హడావుడి చేయడం తప్ప, ఐదేళ్ల పరిపాలన కాలంలో దానిని ప్రారంభించి పూర్తి చేయలేకపోయారు. కేవలం
గ్రాఫిక్స్ లో
రాజధాని నమూనాలు ఇవే అంటూ రకరకాల దేశాల రాజధానుల నమూనాలను చూపించడం తప్ప, అక్కడ ఏ అభివృద్ధి చేయలేకపోయారు. అధికార
పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలకు
టిడిపి సమాధానం చెప్పుకోలేకపోతుంది. కేవలం తాత్కాలిక భవన నిర్మాణాలకు వేలాది కోట్ల సొమ్ములు వెచ్చించి, ప్రజాధనం వృధా పాలు చేశారు అనే విమర్శలకు సరైన సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో
తెలుగుదేశం పార్టీ ఉంది. ఇక ఇప్పుడు త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని,
వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోతుంది అని, మళ్ళీ
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇలా ఎన్నో చెబుతూ
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అసలు కేంద్రం జమీలి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలోనే లేదని,
కేంద్ర మంత్రులు క్లారిటీ ఇచ్చినా, బాబు మాత్రం అది ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
త్వరలోనే జమిలు ఎన్నికలు వస్తాయి అంటూనే, పదే పదే ప్రచారం చేస్తూ, రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారు అనే విమర్శలు ఆయనపై వస్తున్నాయి. గత
టీడీపీ ప్రభుత్వం నేలవిడిచి సాము చేసినట్లుగా బాబు వ్యవహరిస్తూ వస్తున్నట్టు గా కనిపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ఘోరమైన ఫలితాలను చవి చూస్తున్నా, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఆ
పార్టీ నాయకులు అదే రీతిలో వ్యవహరిస్తూ, మరింతగా జనాల్లో నమ్మకం కోల్పోతున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.