
ప్రస్తుత వైసీపీ మంత్రి కన్నబాబు.. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఒకప్పటి జర్నలిస్టులే. ఇప్పుడు తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ బరిలో జర్నలిస్టులు పోటీలో దిగుతున్నారు. జర్నలిస్టులు పోటాపోటీగా పోటీ చేస్తున్నారు.. వీరిలో రాణి రుద్రమ ముందువరుసలో ఉన్నారు. ఈటీవీ2, టీవీ9, సాక్షి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీ న్యూస్, హెచ్ ఎం టీవీ వంటి ప్రధాన స్రవంతి మీడియాలో పని చేసిన అనుభవంతో బాటు దశ దిశ వంటి ప్రోగ్రాంలకు సమన్వయ కర్తగా, ప్రయోక్త గా వ్యవరించి ప్రజల్లోకి వెళ్లగలిగారు. ఆమె యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో సీనియర్ జర్నలిస్ట్ గా పని చేస్తున్న జయ సారధి రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్టు ప్రకటించారు. సిపిఐ పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీ పోటీలో దిగుతున్నారు. టీ న్యూస్ ఇన్ పుట్ ఎడిటర్ పీవీ శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ వ్యవహారాల్లోనూ కీలకంగా ఉన్నాడు. గతంలో టీవీ9 లో పని చేసిన అనుభవం ఉంది. విద్యార్థి ఉద్యమాల్లో పని చేసిన చరిత్రతో బాటు, ఖమ్మం జిల్లాలో ఓ వామ పక్ష పార్టీతో సన్నిహిత సంబంధాలు, ప్రజా సంఘాలతో అనుబంధం కలిసి వస్తుందనే విశ్వాసం. ఎమ్మెల్సీ స్థానానికి తాను కూడా అర్హుణ్ణే అని ఆత్మీయుల సమ్మేళనం లో ప్రకటించాడు.
తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ స్థానంలో రంగంలో తిరుగుతున్నట్టు గతకొంత కాలంగా చెబుతూనే ఉన్నాడు. తీన్మార్ మల్లన్న గతంలో v6 ఛానల్ లో పనిచేసి తర్వాత 10 టీవీ కి మారారు. ఇప్పుడు టీవీ ఫైవ్ లో స్లాట్ కు పని చేస్తున్నాడు. స్వయంగా క్యూ న్యూస్ ఛానల్ నడిపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిత్యం ప్రజల్లో ప్రజాభిమానం చూరగొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకూడా బరిలో దిగుతున్నట్టు సమాచారం. హుజూర్ నగర్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఇండిపెండెంట్ గా రంగంలో దిగుతున్నారట.