దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫలితంతో వచ్చిన కీర్తితో బిజెపి లో ఉత్సాహం బాగా కనిపిస్తోంది. ఇక ఎక్కడ ఎన్నికలు జరిగినా తమదే విజయం అని ఆ పార్టీ నాయకులు బలంగా కనిపిస్తోంది. ముందు నుంచి దుబ్బాక లో గెలుపు తమదే అని కాన్ఫిడెన్స్ ఆ పార్టీ నాయకులు బాగా కనిపించింది దానికి తగ్గట్టుగానే బిజెపి తెలంగాణ నాయకులంతా సమిష్టిగా కృషిచేసి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ తప్పిదాలను జనాల్లోకి తీసుకువెళ్లి అక్కడ అయితే విజయాన్ని నమోదు చేసుకోగలము అనే ధీమా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో ఏపీ లో త్వరలో జరగబోయే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బిజెపి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.
ఈ సీటు ఖచ్చితంగా తమ ఖాతాలోని పడుతుంది అని అభిప్రాయపడుతోంది.అయితే ఇదే సీటును తమ మిత్రపక్షమైన
జనసేన కూడా ఆశిస్తూ ఉండడంతో, ఆ సీటు నుంచి పోటీ చేస్తామని ఆ
పార్టీ నుంచి డిమాండ్ వస్తుందనే భయంతో ముందుగానే ఆ సీట్లో తాము పోటీ చేయబోతున్నాము అని
బిజెపి నాయకులు ప్రకటించేశారు. ఆ ప్రకటన వరకు బాగానే ఉన్నా, బిజెపికి ఇక్కడ గెలిచే అంత బలం ఉందా , ? బలం బలగం లేకుండా... ఏ విధంగా ఇక్కడ గెలవాలని అనుకుంటుంది అనేది రాజకీయ ఉద్దండుల కు కూడా అంతుపట్టని విషయంగా మారింది.2019 ఎన్నికల్లో
తిరుపతి పార్లమెంటు నుంచి
బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినా, నోటా కంటే తక్కువ ఓట్లు ను సంపాదించుకుంది. అయితే ఇప్పుడు
జనసేన బలం కాస్తో, కూస్తో తోడైనా గెలిచే అంతటి సీన్ అయితే లేదనేది రాజకీయ పండితుల అభిప్రాయం.
అయినా
బీజేపీ మాత్రం అటు అధికార
పార్టీ వైసీపీ, టీడీపీలను ధీటుగా ఎదుర్కొని , విజయం తన ఖాతాలో వేసుకుంటామని ఎక్కడ లేని ధీమాను వ్యక్తం చేస్తోంది. అసలు
తిరుపతి పార్లమెంట్ వైసీపీ సిట్టింగ్ స్థానం. అందులోనూ ఆ
పార్లమెంట్ పరిధిలోని
అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం
వైసిపి ఖాతాలోనే ఉన్నాయి.
వైసిపి కి ఇక్కడ గట్టి పట్టు ఉండడంతో పాటు,
జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో అనుకూల అంశాలు ఉండడంతో,
బిజెపి ధీమా పై అనుమానాలు మొదలయ్యాయి. దుబ్బాక గెలుపుతో వచ్చిన కాన్ఫిడెన్స్ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతున్నట్టుగా సెటైర్ లు పేలుతున్నాయి. అయినా ఇక్కడ గెలవగాలము అని, గెలిచి తీరుతామనే విధంగా ఆ
పార్టీ నాయకులు శపధాలు చేస్తుండడంతో, ఏం చూసుకుని ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.