స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ  రమేష్ కుమార్ ను తేలిగ్గా తీసుకునేందుకు లేదు.  కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవోలతో జరగాల్సిన వీడియో కాన్షరెన్సులు  రెండుసార్లు వాయిదా పడింది. మొదటిసారి వాయిదాపడిన తర్వాత గవర్నర్ ను కలిసినపుడు నిమ్మగడ్డ తన ఫిర్యాదుల్లో దీన్ని కూడా చేర్చారు. అయితే మరుసటి రోజు అంటే గురువారం ఉదయం నిర్వహించాలని అనుకున్న వీడియో కాన్ఫరెన్సు రెండోసారి కూడా రద్దయ్యింది. ఫిబ్రవరిలో స్దానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించాలని రమేష్ డిసైడ్ చేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పినపుడు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కరోనా వైరస్ నియంత్రణలో బీజీగా ఉన్నా కారణంగా ఎన్నికల నిర్వహణ కష్టమంటు చెప్పేశారు. అయితే దాన్ని నిమ్మగడ్డ అంగీకరించకుండా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఎన్నికలకు రెడీ అవ్వాలంటు ప్రకటించేశారు.




నిమ్మగడ్డ రాసిన లేఖను  చీఫ్ సెక్రటరీ మళ్ళీ తప్పు పట్టారు. కరోనా వైరస్ సమస్యలతో ఉన్న సమయంలో జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించటం కూడా మంచిది కాదంటు కాస్త గట్టిగానే చెప్పారు. దాంతో సాహ్నిపై నిమ్మగడ్డ బాగా గింజుకున్నారు. అయినా వినకుండా బుధవారం మధ్యాహ్నం జిల్లాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తే ఒక్కళ్ళు కూడా హాజరుకాలేదు. అలాగే గురువారం వీడియో కాన్ఫరెన్సుకు  కూడా ఎవరు హాజరు కాకపోవటంతో రెండోసారి కూడా రద్దయ్యింది. చీఫ్ సెక్రటరీ ఆదేశాలను కాదని జిల్లాల ఉన్నతాధికారులు తనతో వీడియో కాన్ఫరెన్సులో పార్టిసిపేట్ చేస్తారని అనుకునేంత అమాయకుడు కాదు నిమ్మగడ్డ. తాను వీడియో కాన్ఫరెన్సు కు పిలిస్తే ఎవరు హాజరు కాలేదని చెప్పుకోవటానికే  కావాలనే వీడియో కాన్ఫరెన్సుకు హాజరు కావాలని సమాచారం పంపుతున్నారు. ఎందుకంటే  రేపు కోర్టులో కేసు వేసినపుడు తన వాదనకు మద్దతుగా నిమ్మగడ్డ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.




ఎన్నికల ప్రక్రియలో అధికారులు పాల్గొనకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని కోర్టులో  నిమ్మగడ్డ ఫిర్యాదు చేయబోతున్నారు. రాజ్యాంగబద్దమైన వ్యవస్ధను ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా అవమానం చేస్తోందంటూ చెప్పుకోవటానికే నిమ్మగడ్డ ఇదంతా చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఎన్నికల నిర్వహణలో తనకు ప్రభుత్వం సహకరించటం లేదని,  ఉద్యోగులను కమీషన్ కు వ్యతిరేకంగా రెచ్చగొడుతోందని ఇఫ్పటికే నిమ్మగడ్డ  తన వాదన  రెడీ చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయమై రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు చెప్పుకున్నా ఉపయోగం కనబడలేదని చెప్పుకోవటానికే బుధవారం గవర్నర్ ను కూడా కలిశారు. నిజానికి ప్రభుత్వం సహకారం లేకుండా నిమ్మగడ్డ అడుగు కూడా ముందుకేయలేరు. మార్చిలో ఎన్నికల వాయిదాకు కరోనా వైరస్ ను బూచిగా చూపించారు  కమీషనర్. ఇపుడు ఎన్నికల నిర్వహణకు అదే కరోనా వైరస్ ను ప్రభుత్వం కారణంగా చూపిస్తోంది. అప్పట్లో రాష్ట్రం మొత్తం మీద ఒకటి, రెండు కేసులు మాత్రమే ఉన్నపుడు ప్రజల ప్రాణాలకు ముప్పని చెప్పిన నిమ్మగడ్డకు ఇఫుడు 2 వేల కేసులు నమోదవుతున్నపుడు ప్రజల ప్రాణాలకు ముప్పుగా కనిపించకపోవటమే విచిత్రంగా ఉంది. చూద్దాం నిమ్మగడ్డ కోర్టులో కేసు వేస్తే ఏమవుతుందో.


 

మరింత సమాచారం తెలుసుకోండి: