మెల్ల మెల్లగా అధికార పార్టీలో గొడవలు/ఆధిపత్య గొడవలు పెరిగిపోతున్నాయి. ఎంపిలు-ఎంఎల్ఏలు, మంత్రులు-ఎంఎల్ఏల మధ్య గొడవలు ఎక్కువైపోతున్నాయి. దీనికి ఆదిలోని ఫులిస్టాప్ పెట్టే ఉద్దేశ్యంతో జగన్ తొందరలోనే జిల్లాల్లోని ఎంఎల్ఏలు, మంత్రులు, ఎంపిలతో సమావేశాలు నిర్వహించాలని అనుకున్నట్లు సమాచారం. నేతల మధ్య జరుగతున్న గొడవలు కూడా ఏదో నాలుగు గోడల మధ్యో లేకపోతే పార్టీ వేదికల మీదో కాదు. ఏకంగా జిల్లా సమీక్షా సమావేశాల్లోనే బహిరంగంగానే జరుగుతున్నాయి. దాంతో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్యే గొడవలు జరుగుతుండటంతో దాని ప్రభావం ప్రభుత్వంపై పడుతోంది. అదే సమయంలో అధికార పార్టీ అందరి ముందు పలుచనైపోతోంది. ఇటువంటి గొడవ ముందు వైజాగ్ డీఆర్సీ సమావేశంలో ప్రారంభమైంది. వైజాగ్ లో భూముల కబ్జా అంశం ప్రస్తావనకు వచ్చినపుడు రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి ప్రజా ప్రతినిధులు కబ్జాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. నిజానికి ఎంపి కబ్జాల విషయమై ఎవరి పేరును ప్రస్తావించలేదు. అయితే విజయసాయి ఆరోపణలకు చోడవరం వైసీపీ ఎంఎల్ఏ కరణం ధర్మశ్రీ రెచ్చిపోయారు. భూకబ్జాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులెవరో చెప్పలంటూ మండిపోయారు. అలాగే దర్మశ్రీకి అనకాపల్లి ఎంఎల్ఏ అమరనాధ్ తోడయ్యారు. దాంతో వివాదం కాస్త పెద్దదైపోయింది.




సరే తర్వాత ఆ వివాదం జగన్మోహన్ రెడ్డి ముందుకు రావటంతో ఎంఎల్ఏలకు ఫుల్లుగా క్లాసు పీకారు. ఈ వివాదం చల్లారకముందే కాకినాడ డీఆర్సీ సమావేశంలో కూడా ఇలాంటి గొడవే అయ్యింది. ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్-కాకినాడ ఎంఎల్ఏ ద్వారపూడి చంద్రశేఖరరెడ్డికి మధ్య పెద్ద గొడవైంది. ఈ పంచాయితి కూడా చివరకు జగన్ ముందుకొచ్చింది. ప్రజా ప్రతినిధులు బహిరంగంగా గొడవలు పడటం తర్వాత జగన్ సమక్షంలో పంచాయితి జరగటం పెరిగిపోతోంది. దీనివల్ల జగన్ కు టైం వేస్టు, ప్రజా ప్రతినిధులకు జనాల్లో పలుచనైపోతున్నారు. అయితే  ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు గ్రహించటం లేదు. ఎదుటి వాళ్ళపై ఆధిపత్యం చెలాయించాలన్న ఏకైక లక్ష్యంతోనే స్వపక్షం నేతలే అయినా గొడవలు పడటానికి వెనకాడటం లేదు. మామూలుగా ఎక్కడైనా ప్రత్యర్ధి పార్టీల నేతలపై గొడవలు పడటం సహజం. కానీ విచిత్రంగా వైసీపీ ప్రజాప్రతినిధులు మాత్రం సహచరులపైనే గొడవకు రెడీ అయిపోతున్నారు.




ఈ గొడవలన్నీ చూసిన తర్వాత జగన్ కు కూడా విసుగొచ్చేస్తోందట. అందుకనే ఇటువంటి గొడవలకు ఆదిలోనే ముంగిపు పలకాలని డిసైడ్ అయ్యారట. అందుకనే తొందరలోనే జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో సమావేశాలు పెట్టాలని నిర్ణయించారట. ఇప్పటికే గొడవలకు కారణమవుతున్న ఎంఎల్ఏలు ధర్మశ్రీ, అమరనాధ్, ద్వారపూడికి  జగన్ ఫుల్లుగా క్లాసు పీకారు. ఎందుకంటే  పార్టీలో జగన్ తర్వాత విజయసాయే నెంబర్ 2 అన్ విషయం అందరికీ తెలిసిందే. విజయసాయి ఏదేనా మాట చెప్పారంటే అది జగన్ చెప్పినట్లే అనుకోవాలి. అలాంటిది విజయసాయితోనే ఎంఎల్ఏలు నేరుగా వాగ్వాదానికి దిగారంటేనే అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక పిల్లి-ద్వారపూడి గొడవల్లో కూడా ఇదే జరిగింది. ద్వారపూడికన్నా జగన్ కు పిల్లే బాగా దగ్గర. అలాంటిది ద్వారపూడి ఏకంగా పిల్లితోనే గొడవలు పడటాన్ని జగన్ సహించలేకపోయారు. ఇటువంటి వివాదాలు పునరావృతం కాకుండా ఉండాలనే జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారట. అందుకనే తొందరలోనే ప్రజా ప్రతినిధులతో సమావేశాలు పెట్టబోతున్నారు. చూద్దాం సమావేశాల తర్వాత ఎలాంటి మార్పులొస్తాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: