తెలుగుదేశంపార్టీ సీనియర్ నేతలు ఆక్రోసిస్తున్నట్లుగానే తాజాగా ఇద్దరు ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం వీకెండ్ షాక్ ఇచ్చింది. సంవత్సరాల తరబడి చెరబట్టిన ప్రభుత్వ భూములను వాళ్ళనుండి ప్రభుత్వం లాగేసుకున్నది. వైజాగ్ లోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన రుషికొండలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణప్రసాద్ ఆక్రమించిన స్ధలాన్ని ప్రభుత్వం వెనక్కు తీసేసుకున్నది. అలాగే అనకాపల్లి మాజీ ఎంఎల్ఏ పీలా గోవింద్ చెరలో ఉన్న ఆనందపురం మండలంలోని ప్రభుత్వ భూములను లాగేసుకున్నది. దాంతో ప్రభుత్వ భూములను కబ్జాచేసి సంవత్సరాల తరబడి అనుభవిస్తున్న వాళ్ళకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యింది. వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను కబ్జాలు చేసేస్తన్నారంటూ ఒకవైపు టీడీపీ సీనియర్ నేతలు గోల చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. ఇదే సమయంలో టీడీపీ నేతల ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములు ఒక్కోటి బయటపడుతున్న విషయాలను కూడా జనాలు చూస్తున్నారు.




అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే ప్రభుత్వ భూములను దర్జాగా టీడీపీ నేతలే దోచేసుకున్నారు. సబ్బంహరి లాంటి వాళ్ళు కొందరు ప్రభుత్వ భూములను దోచేసి సొంతం చేసుకున్నారు.  మరికొందరు నేతలైతే ఐదేళ్ళపాటు యధేచ్చగా వాడేసుకుని సొంతం చేసుకునే పనిలో ఉన్నారు. ఇక మాజీమంత్రి గంటా శ్రీనివాస్ రావు లాంటి మరికొందరు ప్రభుత్వ భూములను తమవిగా చూపించేసుకుని బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్లరూపాయలు తీసుకున్న విషయాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఐదేళ్ళ హయాంలో ఆక్రమణల విషయంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన టీడీపీ నేతలు ఇపుడు వైసీపీ నేతలపై ఎదురు ఆరోపణలు చేస్తుండటమే విచిత్రంగా ఉంది.




ఇప్పటికే గీతం యూనివర్సిటి మ్యానేజ్మెంట్ కబ్జాలో ఉన్న భూమిని ప్రభుత్వం విడిపించేసింది. అలాగే సబ్బం చెరలో ఉన్న భూమిని కూడా వెనక్కు తీసేసుకుంది.   తాజాగా వెలగపూడి, పీలా కబ్జాల్లోని భూమిని కూడా వెనక్కు తీసుకుంది. వెలగపూడి వందల కోట్లరూపాయల విలువైన ప్రభుత్వ భూమిని చాలా కాలంగా తన కబ్జాలో ఉంచుకున్నారట. అలాగే ఆనందపురం మండలంలోని సుమారు 300 ఎకరాలను మాజీ ఎంఎల్ఏ పీలా గోవింద్ కబ్జా చేశారు. దీని విలువ సుమారు రూ. 300 కోట్లుంటుందని అంచనా. మొన్నటికొమొన్న విశాఖ బీచులో ఇతరు చేతిలో ఉన్న ఓ 20 ఎకరాలను కూడా ప్రభుత్వం తీసేసుకున్నది. ఈ భూమిని సంవత్సరాల తరబడి ఓ బీజేపీ నేతే అక్రమంగా అనుభవిస్తున్నాడనేది టాక్. మొత్తానికి టీడీపీ నేతలే చెప్పుకుంటున్నట్లు ఆదివారం తెల్లవారుజామున మొదలుపెట్టిన ఆక్రమణల తొలగింపును ప్రభుత్వం పూర్తి చేసేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: