అవుననే చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అందరు పడుకున్న తర్వాత ఉద్దేశ్యపూర్వకంగానే గుర్తుతెలీని వ్యక్తులు దేవాలయాలపై రాజకీయ గొరిల్లా వార్ ఫేర్ చేస్తున్నట్లు జగన్ మండిపోయారు. ఊర్లకు దూరంగా ఉన్న దేవాలయాలపైన కన్నేసిన దుండగులు కావాలనే విగ్రహాలను ద్వంసం చేస్తున్నట్లు ఆరోపించారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకే ప్రభుత్వం ప్రతి దేవాలయంలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇఫ్పటివరకు సుమారు 11500 దేవాలయాల్లో సీసీ కేమెరాలను ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే సమస్యే లేదని కూడా హెచ్చరించారు. దాడులు చేసి విగ్రహాలను ద్వంసం చేస్తున్నవారే మళ్ళీ దేవాలయాలపై దాడులంటూ ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు. దుష్టులు దేవాలయాలను ద్వంసం చేసే కార్యక్రమం చేస్తుంటే ప్రభుత్వం దేవాలయాలను, విగ్రహాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  దేవాలయాలపై దాడులు జరిగినా,  విగ్రహాలను ద్వంసం చేసినా ప్రభుత్వానికే చెడ్డపేరొస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి తనకు చెడ్డపేరొచ్చే పనిని ప్రభుత్వమే ఎందుకు చేస్తుంది ? ప్రభుత్వానికి చెడ్డపేరొచ్చేలాగ ఇతరులు చేసే అవకాశాలే కనబడుతున్నాయి. ఇతరులంటే ఎవరు ? ప్రతిపక్షాలు కావచ్చు లేదా వ్యక్తులు కూడా కావచ్చు. వ్యక్తులంటే ఏదో ఒక ఆలయంపైనో లేకపోతే రెండు ఆలయాలపైనో దాడులు చేస్తారు. అంతేకానీ అదేపనిగా సీరియల్లాగ వరుసబెట్టి దేవాలయాలపై దాడులు చేసుకుంటు పోరుకదా. కాబట్టి ఇది కచ్చితంగా వ్యక్తుల వెనుక ఎవరో గట్టివాళ్ళే ఉండి కావాలనే చేయిస్తున్న దాడులుగా అర్ధమైపోతోంది. గట్టివాళ్ళు పార్టీలు కూడా కావచ్చు.




జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వంపై బురదచల్లుతున్నది చంద్రబాబునాయుడు+టీడీపీ నేతలు మత్రమే. కాబట్టి ఇపుడు దేవాలయాలపైన జరుగుతున్న దాడులకు కూడా వాళ్ళే ఉండచ్చు. అలాగే తొందరలో తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగబోతోంది. ఎలాగైనా ఉపఎన్నికలో గెలవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. నిజానికి ఇపుడు ప్రభుత్వం మీదైతే జనాల్లో పెద్దగా  నెగిటివిటీ ఏమీ లేదనే చెప్పాలి. కాబట్టి ఉపఎన్నికల్లో వైసీపీనే గెలిచేందుకు అవకాశం ఉంది. అలా కాదని తామే గెలవాలంటే ఏమి చేయాలి ? సాధ్యం కాకపోయినా ప్రయత్నించాలంటే లేని వివాదాలను తీసుకురావాలి. అప్పుడే జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. ఆపని ఎవరు చేయాలి ? ఇంకెవరు బీజేపీ నేతలకే అవసరం ఉంది. తెలంగాణాలోని గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీ ఏమి చేసిందో అందరు చూసిందే. అదే పద్దతిలో ఏపిలో కూడా లబ్దిపొందాలంటే అలజడులు సృష్టించాలి. అందుకనే ఈ దేవాలయాలను టార్గెట్ చేసుకున్నారేమో అని వైసీపీ నేతల అనుమానిస్తున్నారు. చూద్దాం నిందితులు ఎప్పుడో ఒకపుడు పట్టుబడకుండా ఉంటారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: