అవును స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కేంద్రప్రభుత్వం నుండి ఊహించని షాక్ తగిలింది. ఎలాగైనా స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించాల్సిందే అనే పంతంతో ఉన్న నిమ్మగడ్డ పంచాయితీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలు చెప్పినా లెక్క చేయకుండా తాను అనుకున్నదాన్ని చేసేయాలనే ఆతృతలో నిమ్మగడ్డ షెడ్యూల్ విడుదల చేసేశారు. సరే ఈ విషయమై వెంటనే ప్రభుత్వం కూడా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ కేసు విచారణ జరగబోతోంది. అయితే నిమ్మగడ్డ ఊహించని విధంగా ప్రదానమంత్రి నరేంద్రమోడి కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ను ప్రకటించారు. ఎన్నికలకు షెడ్యూల్ జారీ చేసిన మరుసటి రోజే ప్రధానమంత్రి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రకటించారు.




సో ఇపుడు రెండింటిలో ఏది ఇంపార్టెంట్ అంటే కచ్చితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమానికే చాలా ప్రాధాన్యతుంటుంది. ఎందుకంటే కరోనా వైరస్ టీకా కోసం యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఇటువంటి సమయంలో మిగిలిన అన్నీ కార్యక్రమాలను పక్కకు జరిపి కేవలం వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు కూడా జారీచేసింది. ఇందులో భాగంగానే చివరకు చిన్నారులకు వేసే పోలియో చుక్కల ప్రోగ్రామ్ ను కూడా కేంద్రం వాయిదా వేసింది. మనుషుల ప్రాణాలను రక్షించే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెట్టుకుని ఎవరు కూడా ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపరు. ప్రభుత్వం ఇదే విషయాన్ని చెప్పినా నిమ్మగడ్డ మొండిగా వ్యవహరించినట్లు ఇపుడు అర్ధమవుతోంది. కాబట్టి హైకోర్టు విచారణలో ఇదే అంశంపై వాదనలు జరుగుతాయి. అపుడు కోర్టు కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కన్నా ఎన్నికలే ముఖ్యమని చెప్పే అవకాశాలు దాదాపు లేవు.




సో ఏ విధంగా చూసినా ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ పంతం నెరవేరేట్లు కనబడటం లేదు. వ్యాక్సినేషన్ తొలిదశకు దేశంలో 30 కోట్లమందిని కేంద్రం గుర్తించింది. ఇందులో బాగంగానే రాష్ట్రంలో సుమారు 3 కోట్లమందిని గుర్తించారు. వీరందరికీ మొదటి రౌండు టీకా వేయాలంటే వైద్యారోగ్య సిబ్బందికి సాయంగా పోలీసులు, టీచర్లు, రెవిన్యు ఉద్యోగులు, స్వచ్చంద సంస్ధలు ఇలా ఎంతోమంది కావాలి.  టీకాను వేయించుకునే వాళ్ళు సుమారు 3 కోట్లమంది. వీరికి టీకాలు వేయటానికి అవసరమైన ఏర్పాట్లు చేయటానికి వేలాదిమంది సిబ్బందవసరం. ఇటువంటి సమయంలో ఇక ఎన్నికల నిర్వహణలో ఎవరు పాల్గొంటారు ? ఎలా సాధ్యమవుతుంది ? ఒకేసారి రెండు భారీ కార్యక్రమాలను నిర్వహించటం ప్రభుత్వానికి సాధ్యంకాదు. కాబట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రకటనతో నిమ్మగడ్డకు కేంద్రం షాక్ ఇచ్చినట్లే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: