స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ పంచాయితీకి హైకోర్టు సూపర్ ట్విస్టిచ్చింది. పంచాయితి ఎన్నికల నోటిఫికేషన్ను హైకోర్టు కొట్టేసింది. జనవరి 17వ తేదీ నుండి పంచాయితి ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందన్నట్లుగా నిమ్మగడ్డ ఈనెల 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే 16వ తేదీ నుండి కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మొదలవ్వబోతోంది. ఈ ప్రోగ్రామ్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడినే ప్రకటించారు. దాంతో  ఈ ప్రక్రియకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. ఒకవైపు ప్రభుత్వం వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం నిమ్మగడ్డకు అభ్యంతరం చెప్పింది. అయినా నిమ్మగడ్డ పట్టించుకోలేదు. దాంతో వేరేదారిలేక ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసును సోమవారం విచారించిన కోర్టు ఎన్నికల నోటిఫికేషన్ను కొట్టేసింది.




ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టే అవకాశం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రభుత్వానికి ఉందన్నారు. ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు, మరోవైపు వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేయటం ప్రభుత్వానికి సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. కాబట్టి ఇటువంటి పరిస్ధితుల్లో ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు కోర్టు స్పష్టంగా ప్రకటించింది. కోర్టు తీర్పు తర్వాత నిమ్మగడ్డ బహుశా డివిజన్ బెంచుకు వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. అయితే ఎక్కడికి వెళ్ళినా ఎన్నికల నోటిఫికేషన్ను కొట్టేయటం ఖాయమనే అర్ధమవుతోంది.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల నోటిపికేషన్ను కొట్టేసిన నేపధ్యంలో మరో మూడు నెలల్లోగా ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే వ్యాక్సినేషన్ కార్యక్రమం మరో మూడు నెలలు జరుగుతుంది. మార్చిలో నిమ్మగడ్డ ఎటూ రిటైర్ అయిపోతున్నారు. కాబట్టి నిమ్మగడ్డ రిటైర్ అయ్యేలోగా ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని స్పష్టంగా తేలిపోయింది. తనిష్టప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయటం, చీటికి మాటికి ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవటం, ప్రభుత్వాన్ని కోర్టుకు లాగిన నిమ్మగడ్డకు పదవీ విరమణకు ముందు కోర్టులో యాంటి క్లైమ్యాక్స్ ఎదురవ్వడమే సూపర్ ట్విస్టు. మొత్తానికి అనుకున్నది చేయలేక నిరాశతోనే నిమ్మగడ్డ పదవీవిరమణ చేయాల్సొస్తుందేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: