రాష్ట్రచరిత్రలో గతంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతిని చంద్రబాబునాయుడు మొదలుపెట్టారు. తమకు ఇష్టంలేని ఉన్నతాధికారులపై వరుసగా మతంరంగు పులిమేస్తున్నారు. ఇపుడు పనిచేస్తున్న అధికారులే టీడీపీ హయాంలోనూ పనిచేశారు. కానీ అప్పుడు గుర్తుకురాని వాళ్ళ మతం ఇపుడు చంద్రబాబు అండ్ కో కు హఠాత్తుగా గుర్తుకొచ్చేసింది. ముఖ్యమంత్రిపై క్రిస్తియన్ అనే ముద్రవేసి నాన్ క్రిస్తియన్ జనాలనుండి దూరం చేయాలనే ప్లాన్ లో ఉంది యావత్ ఎల్లోబ్యాచ్. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిపై క్రిస్తియన్ అని, జగన్ హిందు వ్యతిరేకి అనే ఆరోపణలు మొదలుపెట్టింది. జగన్ క్రిస్తియన్ అన్న విషయం రాష్ట్రంలోని అందరికీ ఎప్పటినుండో తెలుసు. కాబట్టి ఎల్లోబ్యాచ్ వేసిన ముద్ర పనిచేయలేదు. దాంతో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కూడా క్రిస్తియనే అనే ఆరోపణలను మొదలుపెట్టారు. అయితే అదంతా పెద్దగా వర్కవుట్ కాలేదు.
వెంటనే రూటుమార్చి సీఎం, హోంశాఖమంత్రితో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ క్రిస్తియన్ అంటు మొదలుపెట్టారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై విచారణను సీఐడీకి అప్పగించింది ప్రభుత్వం. వెంటనే సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ క్రిస్తియన్ అంటు గోల మొదలుపెట్టేసింది. ఇంతమంది క్రిస్తియన్లు గనుకే దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టిచుకోవటం లేదనే విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు మరచిపోయిందేమంటే రాజకీయంగా ఏవైనా వైరముంటే నేరుగా జగన్ తోనే తేల్చుకోవాలి. అంతేకానీ ఉన్నతాధికారులను పిక్చర్లోకి లాగటం ఎంతమాత్రం మంచిదికాదు. ఇదే అధికారులు గతంలో చంద్రబాబు చెప్పినట్లు విన్నారు. ఇపుడు జగన్ చెప్పినట్లు వింటున్నారు.
ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ పై పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని చంద్రబాబు ఉన్నతాధికారులపైన చూపిస్తున్నారు. పరిపాలనలో జగన్ను ఏమీ చేయలేక అత్తమీద కోపం దత్తమీద చూపుతున్నట్లుగా తయారైపోయింది ఎల్లోబ్యాచ్ పరిస్ధితి. అనవసరంగా ఉన్నతాధికారుల మీద, ప్రభుత్వయంత్రాంగం మీద ఆరోపణలు చేసి వాళ్ళతో గొడవలు పెట్టుకోవటం తప్ప చంద్రబాబు అండ్ కో సాధించగలిగేదేమీ లేదు. మాటకొస్తే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కూడా ఇంతస్ధాయికి దిగజారిపోవటమే విచిత్రంగా ఉంది. గతంలో ఎవరు అధికారంలో ఉన్న ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా నేరుగా రాజకీయంగా తేల్చుకున్నారే కానీ ప్రభుత్వ యంత్రాంగం జోలికి వెళ్ళలేదు. టీడీపీ హయాంలో అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరావుపై వైసీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడేవారు. ఎందుకంటే వాళ్ళసాయంతోనే చంద్రబాబు వైసీపీని బాగా దెబ్బతీయటానికి ప్రయత్నించారు. కాబట్టి వాళ్ళకు వైసీపీకి సరిపోయింది. మరిపుడు జగన్ అలాంటి పనులేమీ చేయకపోయినా చంద్రబాబు మాత్రం ఎందుకిలా చేస్తున్నారో ?