ఈమధ్య ఏ చిన్న అవకాశం దొరికినా చంద్రబాబునాయుడు, సోమువీర్రాజు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని హిందు వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. జగన్ కుటుంబం తన తాత, తండ్రి నుండి క్రిస్తియన్ మతాన్ని అనుసరిస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కొత్తగా జగన్ క్రిస్తియన్ అని ఎవరు ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. కానీ ఉద్దేశ్యపూర్వకంగా చంద్రబాబు మాత్రం పదే పదే జగన్ను క్రిస్తియన్ అని ముద్ర వేయటానికి తెగ ప్రయత్నిస్తున్నారు. విచిత్రమేమిటంటే క్రిస్తియన్ అయిన జగన్ హిందుమత వ్యతిరేకి అని జనాల మెదళ్ళలోకి ఎక్కించేందుకు నానా ప్రయాసపడుతున్నారు. అందుకు ఫిట్టింగ్ రిప్లైలాగ సీఎం శుక్రవారం నాడు గోపూజోత్సవంలో పాల్గొన్నారు.




సంప్రదాయ పద్దతిలో చక్కటి పంచ కట్టుతో, నుదుటున నామం పెట్టుకుని గుంటూరు జిల్లాలోని నరసరాపుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగిన గోపూజోత్సవానికి హాజరయ్యారు. దాదాపు అర్ధంగటసేపు జరిగిన గోపూజలో పాల్గొన్నారు. పూజ తర్వాత ప్రజలందరికీ కనుమపండుగ శుభాకాంక్షలు చెప్పారు. అర్ధగంటసేపు పూజలో పాల్గన్న జగన్ తర్వాత మాట్లాడి జనాలందరికీ శుభాకాంక్షలు చెప్పారంతే. గోపూజ గురించో లేకపోతే జగన్ కట్టుకున్న బట్టల గురించో లేకపోతే పెట్టుకున్న బొట్టు గురించో ఇంతగా చెప్పాల్సిన పనిలేదు. అయినా ఎందుకు చెప్పుకున్నామంటే సందర్భం వచ్చింది కాబట్టే. నిజానికి పంచెకట్టుకుని, బొట్టుపెట్టుకున్నంత మాత్రాన హిందువుల దేవుళ్ళపై నమ్మకం ఉన్నట్లు కాదు. అయితే చేసే పనిని ఎంత శ్రద్ధతో చేస్తున్నామన్నదే జనాలు చూస్తారు. గతంలో ఇటువంటి అనేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు బూట్లతోనే హాజరైన విషయం అందరు చూసిందే.





కనుమపండుగ రోజు నరసారుపేటలో జరిగిన గోపూజ పద్దతిలోనే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2679 దేవాలయాల్లో గోపూజలు చేయించింది. టీటీడీ+ఇస్కాన్ సహకారంతో 108 గోవులను నరసరాపుపేట మున్సిపల్ స్టేడియంలో పెద్ద ఎత్తున పూజలు చేశారు. తన మతంగురించి జగన్ ఏరోజూ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ చంద్రబాబు మాత్రమే ఇపుడు పదే పదే తాను హిందువునని ప్రకటించుకుంటున్నారు. పైగా తమ ఆరాధ్యదైవం వెంకటేశ్వరస్వామిగా చెప్పుకుంటున్నారు. నిజానికి చంద్రబాబుకన్నా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారే ఎక్కువగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారేమో.  చంద్రబాబు ఒకేరోజు రాత్రి విజయవాడలో 35 దేవాలయాలను కూల్చేస్తే వాటి పునరుద్ధరణకు జగన్ ఈమధ్యనే శంకుస్ధాపన చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  టీడీపీ, బీజేపీ మొదలుపెట్టిన మత పరమైన రాజకీయాలను జగన్ కూడా మతపరమైన కార్యక్రమాలతోనే గట్టి రిప్లై ఇచ్చారు.




మరింత సమాచారం తెలుసుకోండి: