దీన్ని దృష్టిలో పెట్టుకునే గురువారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి సమావేశంలో మాట్లాడుతూ వారంలోగా పార్టీ అభ్యర్ధిపై నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. ఉపఎన్నికలో జనసేన అభ్యర్ధే పోటీ చేయాలని తమపార్టీలోని నేతలంతా పట్టుబడుతున్నట్లు చెప్పారు. జనసేన అభ్యర్ధి పోటీచేస్తే తాను లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో తిరిగి ప్రచారం చేసే అవకాశం ఉంటుందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే పవన్ ఉద్దేశ్యంలో బీజేపీ అభ్యర్ధి పోటీచేస్తే ప్రచారానికి తాను రానని చెప్పారా ? అనే సందేహాలు మొదలయ్యాయి. పైగా వారంలో పార్టీ అభ్యర్ధిని వారంలోగా ఫైనల్ చేసేస్తామంటే ఏమిటర్ధం ? వారంలోగా ఏ పార్టీ పోటీ చేయాలో తేల్చుకుని చెప్పమని బీజేపీకి డెడ్ లైన్ పెట్టినట్లే అనిపిస్తోంది.
ఉపఎన్నికలో ఏ పార్టీ పోటీ చేయాలో డిసైడ్ చేయటానికి రెండుపార్టీల తరపున నేతలతో కమిటి వేస్తామని చెప్పిన కమలంపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఇంతవరకు ఆపని చేయలేదు. స్వయంగా పవన్ తోనే దాదాపు రెండు నెలల క్రితం చెప్పిన నడ్డా ఇంతవరకు కమిటిని ఎందుకు వేయలేదు ? అన్నదే ఇఫుడు అనుమానంగా ఉంది. సో జరుగుతున్నది చూస్తుంటే రెండుపార్టీల మధ్య పొత్తును తిరుపతి ఉపఎన్నికే డిసైడ్ చేసేస్తుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండుపార్టీలకు ఉపఎన్నికలో గెలిచేంత సీన్ లేదన్నది వాస్తవం. కాకపోతే రెండుపార్టీలు కూడా దేనికదే తమ స్ధాయిని ఎక్కువగా ఊహించుకుని బలముందని చెప్పుకుంటున్నాయి. మరి తాజాగా పవన్ డెడ్ లైన్ను బీజేపీ పట్టించుకుంటుందా ? చూడాల్సిందే.