స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు డేంజర్ బెల్స్ మొదలవుతున్నాయా ? అలాగే ఉంది ప్రివిలేజ్ కమిటి ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే. స్ధానికసంస్ధల ఎన్నికల నిర్వహణ పేరుతో నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలు, ఇస్తున్న ఆదేశాలు చాలా ఓవర్ గానే అనిపిస్తోంది జనాలకు. రాజ్యాంగబద్దమైన అధికారాల పేరుతో నిమ్మగడ్డ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, లక్ష్మణరేఖను దాటేశారని మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటికి పరాకాష్టగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈనెల 21వ వరకు హౌస్ అరెస్టు చేయాలని, మీడియాతో మాట్లాడటాన్ని నియంత్రించాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీచేయటం సంచలనంగా మారింది. నిమ్మగడ్డ ఇఛ్చిన ఆదేశాలతో ప్రభుత్వం మండిపోతోంది.




తనను నియంత్రించే అధికారం కమీషనర్ కు లేదంటు పెద్దిరెడ్డి వేసిన పిటీషన్ను విచారించిన కోర్టు ఆదేశాలను కొట్టేసింది. కోర్టు తీర్పుతో నిమ్మగడ్డ మంత్రి విషయంలో ఓవర్ యాక్షన్ చేసినట్లు తేలిపోయింది. ఇదే విషయమై కాకాణి మాట్లాడుతు కమీషనర్ గా నిమ్మగడ్డ ను బర్తరఫ్ చేయాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. నిమ్మగడ్డపై ప్రివిలేజ్ కమిటి చర్యలు తీసుకునేందుకు వేదిక రెడీ అవుతున్నట్లు చెప్పారు. కమిటి తీసుకునే నిర్ణయాన్ని కోర్టులు కూడా జోక్యం చేసుకునేందుకు లేదని స్పష్టంగా చెప్పారు. కమిటి సిఫారసు చేయబోయే చర్యలను ఫేస్ చేయటానికి నిమ్మగడ్డ రెడీగా ఉండాలని కాకాణి చేసిన హెచ్చరిక కలకలం రేపుతోంది.




పదే పదే మహారాష్ట్రలో 2006లో జరిగిన ఘటననే ఉదహరిస్తున్నారు. అంటే అక్కడ జరిగినట్లే ఇక్కడ కూడా కమీషనర్ ను జైలుకు పంపే అవకాశాలున్నట్లు అనుమానంగా ఉంది. కమిటి సిఫారసు మేరకు స్పీకర్ గనుక నిమ్మగడ్డ అరెస్టుకు ఆదేశాలిస్తే వెంటనే జైలు తప్పదు. స్పీకర్ నిర్ణయంపై కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం తక్కువే. ఒకవేళ జోక్యం చేసుకున్నా స్పీకర్ గట్టిగా నిలబడితే కోర్టు  చేయగలిగేది ఏమీలేదు. అయితే పరిస్ధితి ఇంతదాకా రాకూడదని, పరిధి దాటకూడదనే ప్రభుత్వం నిమ్మగడ్డకు హెచ్చరిక లాంటి సంకేతాలు ఇచ్చింది. అయితే కమీషనర్ ఆ హెచ్చరికను లెక్కచేయకుండా ఏకంగా పెద్దిరెడ్డి హౌస్ అరెస్టుకు ఆదేశాలివ్వటం సంచలనమైంది. మరి కాకాణి తాజా వ్యాఖ్యల పర్యవసానం ఎలాగుంటుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: