జగన్మోహన్ రెడ్డి బాణం వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం సమావేశం జరగబోతోంది. షర్మిల ఆధ్వర్యంలో తెలంగాణాలో కొత్త రాజకీయపార్టీ ఏర్పాటవబోతోందంటు కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఇతర పార్టీల్లో మిశ్రమస్పందన కనబడుతోంది. సరే ఎవరి స్పందనలు ఎలాగున్నా, ఎవరి ఆకాంక్షలు ఎలాగున్నా షర్మిల నేతృత్వంలో లోటస్ పాండ్ లో మంగళవారం ఉదయం సమావేశం జరుగబోతున్నది మాత్రం నిజం. సమావేశానికి హాజరవ్వాలంటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆత్మీయులకు షర్మిల తరపున మొబైల్ సమాచారం పంపారట. సమావేశానికి ఆహ్వానం ఎవరెవరికి వెళ్ళింది, ఎవరెవరు హాజరవుతారనే విషయమై ఒక్కసారిగా ఊహాగానాలు పెరిగిపోయాయి.




నిజానికి వైఎస్సార్ కు తెలంగాణా వ్యాప్తంగా గట్టి మద్దతుదారులున్నారన్నది వాస్తవం. దాదాపు ప్రతి జిల్లాలోను మద్దతుదారులున్నారు. నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్, నిజామాబాద్ లో షబ్బీర్ ఆలీ ఆహ్మద్, బాజిరెడ్డి గోవర్ధనరెడ్డి అండ్ కో మహబూబ్ నగర్లో సురేష్ రెడ్డి, చిన్నారెడ్డి అండ్ కో, ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి అండ్ కో, హైదరాబాద్ లో దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, వరంగల్ లో కొండా సురేఖ దంపతులు, రంగారెడ్డి జిల్లాలో సబితా ఇంద్రారెడ్డి ఇలా చెప్పుకుంటుపోతే జాబితా చాలా పెద్దదే ఉంటుంది. వీళ్ళలో అత్యధికులు వైఎస్సార్ కు డైహార్డ్ మద్దతుదారులనే చెప్పాలి. వీళ్ళందరికీ వైఎస్సార్ కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాంటిది హఠాత్తుగా వైఎస్ మరణించటంతో వీళ్ళల్లో చాలామంది రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు.




ఇపుడు తెలంగాణాలో రాజకీయంగా శూన్యత ఉందనేది పరిశీలకుల అంచనా. అధికార టీఆర్ఎస్ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ చీలికలు పీలికలైపోయాయి. బీజేపీ మాత్రమే కేసీయార్ కు థ్రెట్ గా తయారవుతోంది. బీజేపీ కేసీయార్ కు థ్రెట్ గా తయారుతోందంటే అది స్వయంకృతమనే చెప్పాలి. సో బీజేపీని దెబ్బ కొట్టాలంటే అది కేసీయార్ చేతుల్లో లేదు. తెలంగాణాలోని రెడ్లు, బీసీలు, ఎస్సీ, ఎస్టీల్లో వైఎస్సార్ పైన ఉన్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీయారే షర్మిలతో తెలంగాణాలో పార్టీ పెట్టిస్తున్నారనేది ఒక ప్రచారం. అదేం కాదు జగన్+షర్మిల మాట్లాడుకునే తెలంగాణాలో పార్టీ పెడుతున్నారనే మరో ప్రచారం. జగన్ పరిపాలన తీరు చూసిన తర్వాత తెలంగాణాలో కూడా రెడ్లు, బీసీలు, ఎస్సీల్లో జగన్ పై ఆదరణ పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని జగనే చెల్లెలితో పార్టీ పెట్టిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా షర్మిల సమావేశం మాత్రం రాజకీయంగా బాగా ఆసక్తిని రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: