చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. మనదేశంలో అయితే ఇప్పటివరకు ఇటువంటి ఆఫర్ ఎవరు ఇఛ్చినట్లు కూడా రికార్డు కాలేదు. అలాంటి బంపర్ ఆఫర్ ను ఎన్డీయే నుండి కాంగ్రెస్ నేతకు అందటం ఆశ్చర్యంగానే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి గులామ్ నబీ ఆజాద్ పదవీకాలం మరో వారంరోజుల్లో ముగిస్తోంది. ఇదే విషయాన్ని బుధవారం రాజ్యసభలో కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే ప్రస్తావిస్తు ఆజాద్ లాంటి సీనియర్ సేవలు పార్లమెంటుకు, దేశానికి చాలా అవసరమన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆజాద్ లాంటి నేతల సేవలను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉపయోగించుకునేది లేనిదీ ఇంకా స్పష్టం కాలేదన్నారు.
ఒకవేళ కాంగ్రెస్ ఆజాద్ సేవలను ఉపయోగించుకోలేకపోతే ఎన్డీయే తరపున రాజ్యసభకు ఆజాద్ ను నామినేట్ చేస్తామంటు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి ఆజాద్ ను రాజ్యసభకు పంపే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి దాదాపు లేదనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద రాష్ట్రాల్లో రాజస్ధాన్ లో తప్ప కాంగ్రెస్ మరెక్కడా అధికారంలో లేదు. ఉన్న అరాకొరా చోట్ల రాజ్యసభకు పంపే అవకాశాలు లేవు. మరి ఈ పరిస్ధితుల్లో 71 ఏళ్ళ వయస్సున్న ఆజాద్ సేవలను పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటదనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్దితి దారుణంగా తయారైంది. తొందరలోనే ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ దాటుతుందనే నమ్మకం కూడా ఎవరిలోను లేదు. మిగిలిన కేరళ ఎన్నికలపైన మాత్రమే కాస్త ఆశలు పెట్టుకుంది.
ఇవన్నీ లెక్కలు వేసుకున్న తర్వాతే ఎన్డీయేలో కీలక సభ్యుడైన రాందాస్ కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన ఆజాద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లున్నారు. మరి రాందాస్ బంపర్ ఆఫర్ ను ఆజాద్ అంగీకరిస్తారా ? ఇదే ఇపుడు సస్పెన్సుగా మారిపోయింది. ఎందుకంటే దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో ముడిపడున్న అనుబంధాన్ని ఒక్కసారిగా వదులుకుని బీజేపీలో చేరిపోతారని ఎవరు అనుకోవటం లేదు. ఇదే సమయంలో ఒకపుడు రాజ్యసభ డిప్యుటి ఛైర్ పర్సన్ గా కాంగ్రెస్ తరపున పనిచేసిన నజ్మా హెఫ్తుల్లా ఇపుడు బీజేపీలో ఉన్నారు. ఆమెకు కూడా దశాబ్దాల అనుబంధం ఉంది కాంగ్రెస్ తో. కానీ బీజేపీ నుండి ఆఫర్ రావటం, కాంగ్రెస్ డౌన్ ఫాల్ మొదల్లవటంతో ఆమె వెంటనే బీజేపీలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఎప్పుడేమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు.