ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు ఏమో అయ్యింది. లేకపోతే ఇలా పిచ్చి పిచ్గా మాట్లాడరు. సింపుల్ లాజిక్ కూడా చంద్రబాబు మిస్సయిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. తాజాగా ముగిసిన పంచాయితి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోందట. పంచాయితి ఎన్నికల్లోనే వైసీపీ పతనం ప్రారంభమైందని చంద్రబాబు చాలా గట్టిగా చెబుతున్నారు. మరి చంద్రబాబు చెబుతున్నదాంట్లో లాజిక్ ఏమిటో బహుశా తమ్ముళ్ళకు కూడా అర్ధంకాదేమో. ఎందుకంటే 13 వేల చిల్లర పంచాయితీలకు ఎన్నికలు జరిగితే సుమారు 10వేలకు పైగా పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులే గెలిచారు. తెలుగుదేశంపార్టీ మద్దతుదారులు గెలిచింది 2 వేల చిల్లర పంచాయితీలే.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సుమారు 80 శాతం పంచాయితీలు గెలిచిన వైసీపీకి పతనం మొదలైందని చంద్రబాబు ఎలా అనుకుంటున్నారో అర్ధం కావటంలేదు. 20 శాతంకు మాత్రమే పరిమితమైన టీడీపీని జనాలు తిరస్కరించారని వైసీపీ నేతలు ఎదురు మాట్లాడుతున్నారు. నూటికి 80 మార్కులు తెచ్చుకున్న విద్యార్ధి ఫెయిల్ అయినట్లా ? లేకపోతే 20 మార్కులు తెచ్చుకున్న విద్యార్ధి ఫెయిలైనట్లా ? బుర్రున్న వారెవరైనా 20 మార్కులు తెచ్చుకున్న విద్యార్ధే ఫెయిలైనట్లు ఠకీమని చెప్పేస్తారు. ఎందుకంటే దీనికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కానీ చంద్రబాబు మాత్రం 80 మార్కులు తెచ్చుకున్న విద్యార్ధే ఫెయిలైనట్లు విచిత్రమైన వాదన మొదలుపెట్టారు. ఇందుకే చంద్రబాబుకు ఏమో అయ్యిందని అనుమానంగా ఉంది.




పంచాయితి ఎన్నికల ద్వారా బయటపడిందేమంటే జగన్మోహన్ రెడ్డి పాలనపై జనాల్లో పెద్దగా వ్యతిరేకత ఇంకా మొదలు కాలేదన్న విషయం తేలింది. ఇపుడు జగన్ పై పెరిగిపోతున్న వ్యతిరేకత అంతా చంద్రబాబు మీడియా సమావేశాల్లోను, ఎల్లోమీడియా రాతల్లో తప్ప ఇంకెక్కడా లేదు. నిజానికి పంచాయితి ఎన్నికలు ఇపుడు జరిగినంత సీరియస్ గా గతంలో ఎప్పుడు జరగలేదనే చెప్పాలి. పంచాయితీ ఎన్నికలపై చంద్రబాబు చేసిన గోల కారణంగానే వైసీపీ నేతలు కూడా సీరియస్ గా తీసుకున్నారు. మొత్తానికి పంచాయితి దెబ్బకు చంద్రబాబుకు ఏమో అయ్యిందనే అనుమానాలు మాత్రం పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: