ఎల్లోమీడియా యాజమాన్యం ఆదివారం రాసిన కొ(చె)త్తపలుకులో నలుగురు బ్లాక్ బెయిలర్ల విషయాన్ని బయటపెట్టింది. కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వాన్ని చూసుకుని రాష్ట్రంలో బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు, ఢిల్లీ ఏపి రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోథర్ బ్లాక్ మెయిల్ చేస్తు బతకటానికి అలవాటు పడిపోయారట. అప్పుడెప్పుడో బావ కళ్ళల్లో ఆనందం చూడటంకోసమే అని ఎవరో చెప్పినట్లుగా పై నలుగురు ఇపుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే పనిచేస్తున్నారట. వీళ్ళు నలుగురు జగన్ ప్రయోజనాలను కాపాడటానికే పనిచేస్తున్నట్లు ఎల్లోమీడియా తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది. నిజానికి ఎల్లోమీడియా చేసిన వ్యాఖ్యలు నలుగురి ఇమేజిని తవ్రంగా దెబ్బతీసేవే. అయితే సునీల్ ఎవరో రాష్ట్రంలో పెద్దగా ఎవరికీ తెలీదు కాబట్టి ఆయనకు వచ్చే నష్టం ఏమీలేదు.




ఒక్కసారిగా వీర్రాజు అండ్ కో ను ఎల్లోమీడియా బ్లాక్ మెయిలర్లుగా ఎందుకు అభివర్ణించాల్సొచ్చింది ? వాళ్ళు ఎవరినైనా నరేంద్రమోడి పేరుచెప్పి  బెదిరించారా ? అసలు వీళ్ళవల్ల జగన్ కు జరిగిన, కలుగుతున్న ప్రయోజనాలేమున్నాయి ? ఈ విషయాల్లో ఎల్లోమీడియా యాజమాన్యమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే పై నలుగురిలో ఎవరు కూడా కేంద్ర నాయకత్వాన్ని ఏ విషయంలో కూడా ఒప్పించేంత సీన్ ఉన్నవాళ్ళు కాదని తేలిపోయింది. మరి వీళ్ళు ఏ విధంగా జగన్ ప్రయోజనాలను కాపాడగలరు ?  పై నలుగురి మీద ఆధారపడటానికి జగన్ ఏమీ అనామకుడు కాదు. పోనీ ఎల్లోమీడియానే చెప్పినట్లుగా చంద్రబాబునాయుడు లాగ భయపడే వ్యక్తి కూడా కాదు. తన చెత్తపలుకులో జగన్+చంద్రబాబు కేంద్రానికి భయపడుతున్నారని రాసార్లేండి.




కేంద్రానికి జగన్, చంద్రబాబులో ఎవరు భయపడుతున్నారన్న విషయంలో జనాలకు ఫుల్లు క్లారిటి ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎల్లోమీడియా సర్టిఫికేట్ అవసరమే లేదు. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే నలుగురు బీజేపీ నేతలను ఎల్లోమీడియా బ్లాక్ మెయిలర్లని ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. బహుశా వీళ్ళలో రాష్ట్ర నేతలంతా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు కాబట్టే ఎల్లోమీడియాకు వీళ్ళంటే మంట ఉందేమో. ఒకవైపు ఎల్లోమీడియా జగన్ను టార్గెట్ చేస్తుంటే మరోవైపు బీజేపీ నేతలు చంద్రబాబును ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. తమ ఆరాధ్య దైవాన్ని బీజేపీ టార్గెట్ చేయటాన్నే ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోందేమో. అందుకనే బహిరంగంగానే వీళ్ళని బెదిరించి బతికేసే బాపతుగా చెత్తపలుకులో అభివర్ణించింది. మరి తాజా ఆరోపణలకు వీళ్ళు ఎలా రియాక్టవుతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: