కమలంపార్టీ నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ణు మామూలు దెబ్బ కొట్టలేదు. ప్రశ్నించటానికే పార్టీ పెట్టినట్లు చెప్పుకున్న పవన్ చివరకు ప్రశ్నించటమే మరచిపోయినట్లున్నారు. బీజేపీకి మిత్రపక్షంగా చేరిన పాపానికి ఇపుడు విశాక ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇంతగా ఆందోళన జరుగుతున్నా కనీసం మద్దతు ప్రకటించే  ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. ఉక్కు ప్రైవేటీకరణపై మాట్లాడనీయకుండా బీజేపీ నేతలను కేంద్ర ప్రభుత్వం ఎలా కంట్రోలు చేసిందో అలాగే పవన్ నోరును కూడా మూసేసింది. అందుకనే ఆందోళనలకు మద్దతుపలకలేక, ఆందోళనల్లో పాల్గొనలేక చివరకు జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లుతున్నారు.



ప్రైవేటీకరణను ఆపేవిషయంలో పవన్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే ముందు ప్రశ్నించాల్సింది నరేంద్రమొడినే. కానీ ఆపని చేయలేక ఎలాంటి సంబంధంలేని జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అంటే తన ఆత్మబంధువు చంద్రబాబునాయుడు అడుగుజాడల్లోనే పవన్ ఇంకా నడుస్తున్నట్లు అర్ధమైపోతోంది. కేంద్రప్రభుత్వం మద్దతు కోసం బీజేపీతోను జగన్ పై బురదచల్లే విషయంలో చంద్రబాబు మార్గంలోను పవన్ నడుస్తున్నారు. దీంతో పవన్ కంటు సొంత తెలివిలేటలు లేవని మరోసారి జనాలకు అర్ధమైపోయింది. నిజానికి ఉక్కు ప్రైవేటీకరణకు అడుగులు పడింది మొదట చంద్రబాబు హయాంలోనే. 2018లోనే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం తీసుకున్నట్లు స్వయంగా ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టంగా పార్లమెంటులో ప్రకటించారు.



అంటే మొదట నిర్ణయం జరిగినపుడు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. మొదట తీసుకున్న నిర్ణయం ప్రకారమే 2019 అక్టోబర్లో కేంద్రానికి, దక్షిణకొరియా సంస్ధ పోస్కోతో అవగాహనా ఒప్పందం (ఎంవోయు) జరిగింది. అప్పుడు సీఎంగా ఉన్నది జగనే అనటంలో సందేహం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో భాగస్వామ్యం ఉంటే చంద్రబాబు, జగన్ ఇద్దరికీ ఉంటుంది. ఒకవేళ భాగస్వామ్యం లేకపోతే ఇద్దరికీ ఉండదు. అంతేకానీ చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేకుండా కేవలం జగన్ కు మాత్రమే ఎలాగుంటుందనే ఇంగితం కూడా పవన్ కు లేకుండాపోయింది. మొత్తం మీద అప్పట్లో చంద్రబాబుతో చేరి ఇఫుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా పవన్లో ప్రశ్నించే తత్వమే చచ్చిపోయిందని అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: