ఇప్పుడు ఇండియాకు వ్యాక్సిన్ అత్యవసరం. నిజమే. కానీ.. కేంద్రం ఆమెదించిన వ్యాక్సిన్ విధానం తయారీ సంస్థలకు కోట్లు దోచి పెట్టేదిగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అనేక మంది మేధావులు ఈ వాదన వినిపించారు. తాజాగా వీక్షణం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్‌ ఆసక్తికరమైన  లెక్కలు ఆవిష్కరించారు.  

ఆయన చెబుతున్న దాని ప్రకారం..

కావలసిన మొత్తం వాక్సిన్ డోసులు – మొత్తం జనాభా (139 కోట్లు)
రెండు డోసులైతే - 278 కోట్ల డోసులు.
ప్రస్తుత విధానం ప్రకారం వయోజన జనాభా (18 పైన) – దాదాపు 100 కోట్లు - 200 కోట్ల డోసులు.  
కేంద్ర ప్రభుత్వ కోటా  50 శాతం - 100 కోట్ల డోసులు
కేంద్ర ప్రభుత్వానికి సగటు ధర (కనీసం రు. 150 – గరిష్టం రు. 400)  రు. 275
కేంద్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు  రు. 27,500 కోట్లు
మిగిలిన 50 శాతంలో రాష్ట్ర ప్రభుత్వాలు 2/3 వంతులు, ప్రైవేటు సంస్థలు 1/3 వంతు కొనుక్కుంటాయనుకుంటే
రాష్ట్ర ప్రభుత్వాల కొనుగోలు  65 కోట్ల డోసులు


రాష్ట్ర ప్రభుత్వాలకు సగటు ధర (కనీసం రు. 400 – గరిష్టం రు. 600)  రు. 500
రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ఖర్చు రు. 32,500 కోట్లు
ప్రైవేటు సంస్థల కొనుగోలు  35 కోట్ల డోసులు
ప్రైవేటు సంస్థలకు సగటు ధర (కనీసం రు. 600 – గరిష్టం రు. 1200) రు. 900
ప్రైవేటు సంస్థలు పెట్టే ఖర్చు  రు. 31,500 కోట్లు
వాక్సిన్ల మీద దేశంలో ఒక ఏడాదిలో వెచ్చిస్తున్న వ్యయం, తక్కువలో తక్కువ అంచనా వేస్తే రు. 91,500 కోట్లు


ఒక డోస్ రు. 150 కి అమ్మినా తాము లాభం గడిస్తామని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సి ఇ వో చెప్పిన ప్రకారం దేశం మొత్తంగా రు. 30,000 కోట్లు (200 కోట్ల డోసులు @ రు. 150) ఖర్చు పెట్టినా వాక్సిన్ ఉత్పత్తి దారులకు లాభాలే మిగులుతాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఉత్పత్తిదారులకు అదనంగా కనీసం రు. 61,500 కోట్లు అప్పనంగా అందుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: