విద్యుత్‌ సమస్య మరోసారి తెరపైకి వస్తోంది. దాదాపు గత ఐదారేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య పెద్దగా లేదనే చెప్పాలి. కానీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా విద్యుత్ సమస్య ఇబ్బంది పెడుతోంది. ముందు ముందు పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ కారణంగా విద్యుత్ ధరలు, బొగ్గు ధరలు బాగా పెరిగిపోయాయి. అయితే.. ఈ ధరల వద్ద కొనేందుకు రాష్ట్ర ఖజానాలో డబ్బు లేకే జగన్ రాష్ట్రాలన్ని చీకట్లో ఉంచుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.


విద్యుత్ సమస్య అంటే.. నేరుగా జనం జీవితాలను ప్రభావితం చేసే అంశం. మిగిలిన రాజకీయ సమస్యల కంటే దీని తీవ్రత ఎక్కువ. విద్యుత్ సమస్య తీవ్రమైతే.. రాష్ట్రంలోప్రతి వర్గమూ ఇబ్బంది పడుతుంది. అలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రతిపక్షానికి కీలక పాత్ర అవుతుంది. పరిస్థితులపై ఎప్పటి కప్పుడు స్పందించాల్సిన అవసరం ప్రతిపక్షానికి ఉంటుంది. ప్రభుత్వ తప్పులను నిలదీసే అవకాశమూ వస్తుంది. ఇలాంటి సమస్యలపై స్పందిస్తే.. జనం కూడా ఆ  పార్టీని మెచ్చుకుంటారు.


అయితే ఈ విషయంలో టీడీపీకి ఓ చిక్కు ఉంది. గతంలో చంద్రబాబు ఈ విద్యుత్‌ సమస్యపై వ్యవహరించిన తీరు ఇప్పుడు టీడీపీకి కాస్త ఇబ్బంది కరంగా మారుతోంది. విద్యుత్‌ సమస్యపై టీడీపీ మాట్లాడటం మొదలు పెట్టగానే వైసీపీ ఎదురుదాడి చేస్తుంది.. చంద్రబాబు పాత చరిత్రను తవ్వుతారు.. 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు  ఎలక్ట్రిసిటీ యాక్ట్‌ వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగం మీద చంద్రబాబు చేసిన దుర్మార్గాలను ప్రస్తావిస్తారు.


ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులపై కాల్పులు కూడా జరిపించింది. అది చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఓ మచ్చగా మిగిలిపోయింది. అప్పట్లో కాల్తేరులో, ఏలూరులో, బషీర్‌బాగ్‌లో రైతుల ఆందోళనలను అణిచించేదుకు  కాల్పులు జరిగాయి.  అంతే కాదు.. కరెంట్‌ బిల్లులు కట్టడం లేదన్న కారణంతో వరంగల్, మహబూబ్‌నగర్‌ లాంటి జిల్లాల్లో రైతులకు బేడీలు వేశారు. చంద్రబాబు విద్యుత్‌ సమస్యపై స్పందిస్తే.. వైసీపీ ఇవన్నీ గుర్తు చేస్తుంటుంది. టీడీపీకి అదో ఇబ్బంది.


మరింత సమాచారం తెలుసుకోండి: