మనది మొదటి నుంచి ధార్మిక సమాజం.. దైవ చింతన ఎక్కువ. అది మన సంస్కృతి సంప్రదాయాల్లోనూ ప్రతిబింబిస్తుంది. మనం పిల్లలకు పెడుతున్న పేర్లలో చాలా వరకూ దేవుడి పేర్లే ఉంటాయి. ఇప్పుడు కాస్త ట్రెండ్ మారుతున్నా.. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అలాగే మన ఊళ్ల పేర్లు కూడా.. అయితే.. ఏకంగా జిల్లాలను కూడా దేవుడి పేర్లతో పెట్టుకున్న ఘన చరిత్ర మనది. మరి తెలుగు నేలపై అలా దేవుడి పేర్లతో ఉన్న జిల్లాలేంటో తెలుసుకుందామా..?


తెలుగు నేలపై దేవుళ్ల పేరుతో జిల్లాలు ఏర్పాటు చేసిన ఘనత మాత్రం కేసీఆర్‌ కే దక్కుతుంది. అప్పటి వరకూ ప్రముఖ నాయకుల పేర్లు జిల్లాలకు పెట్టేవారు కానీ.. దేవుళ్ల పేర్లు మాత్రం పెట్టలేదు. తెలంగాణలో జిల్లాల పునర్వవస్థీకరణ సమయంలో కేసీఆర్ కొన్నిజిల్లాలకు దేవుళ్ల పేర్లు పెట్టారు. గద్వాలను జిల్లాగా చేసినప్పుడు అక్కడి ప్రముఖ జోగులాంబ ఆలయం పేరు మీదుగా.. జోగుళాంబ గద్వాల అని నామ కరణం చేసారు.


ఇక ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలం జిల్లాను వేరు చేసినప్పుడు.. భద్రాద్రి రామయ్య పేరుపై భద్రాద్రి కొత్త గూడెం గూడెం జిల్లా ఏర్పాటు చేశారు. వేములవాడ రాజేశ్వర స్వామి పేరు పై రాజన్న సిరిసిల్ల.. యాదగిరిగుట్ట దేవుడి పేరు మీద యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారు. ఆయన ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో  ఏకంగా మూడు జిల్లాలకు దేవుళ్ల పేర్లే పెట్టారు. ఆయన అలా పెట్టేందుకు సహేతుక కారణాలే ఉన్నాయి.


చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి ను వేరు చేసి జిల్లా చేయాలనుకున్నప్పుడు దాన్ని శ్రీ బాలాజీ జిల్లాగా ఏర్పాటు చేశారు. అలాగే అనంతపురం నుంచి పుట్టపర్తిని విడదీసి జిల్లా చేస్తూ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. అలాగే కడప జిల్లా నుంచి కొంత భాగాన్ని విడదీసి.. అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేశారు. అలా తెలుగు నేలపై దాదాపు ఏడు జిల్లాలకు దేవుళ్ల పేర్లే ఉన్నాయన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: