తమ సుఖాలు.. తమ సౌఖ్యాలు.. తప్ప..తమకు ఇంకేమీ అవసరం లేదని అన్నట్టుగా వారు ఉన్నారని అంటున్నారు. కొందరునేతలైతే.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పదవులు పంచుకునేందుకు రెడీగా ఉన్నారు తప్ప.. పార్టీ కష్ట కాలంలో బయటకు తీసుకువచ్చేందుకు.. చంద్రబాబు కు చేయూతగా ఉండేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. అదేసమయంలో పార్టీని పుంజుకునేలా చేసేందుకు కూడా వీరు ప్రయత్నాలు చేయడం లేదు. కార్యకర్తల్లో బలం లేదు. పార్టీ తరఫున గట్టివాయిస్ కూడా వినిపించడం లేదు.
దీంతో వీరంతా వైట్ ఎలిఫెంట్సేనని అంటున్నారు తమ్ముళ్లు. ఈ జాబితాలో మాజీ మంత్రులు కూడా ఉండడం అత్యంత దారుణంగా ఉంది. టీడీపీలో జరుగుతున్న చర్చలను బట్టి.. మాజీ మంత్రులు.. కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన రాజప్ప, కాల్వ శ్రీనివాసులు..పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు.. పార్లమెంటరీ జిల్లాలకు ఇంచార్జులుగా బీకే పార్థసారథి, నెట్టెం రఘురాం, లింగారెడ్డి, తోట సీతారామ లక్ష్మి వంటివారు.. పార్టీలో ఏమీ ప్రయోజనం లేకుండా ఉన్నారని తెలుస్తోంది. మరి వీరి విషయంలో చంద్రబాబు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలనేది టీడీపీ నేతల డిమాండ్. మరి ఏం చేస్తారో చూడాలి.
ఇక, వీరంతా కూడా పార్టీ అధికారంలోకి వస్తే.. వెంటనే పదవుల కోసం పోటీ పడుతుండడం గమనార్హం. మరోవైపు.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మాత్రం ఎవరూ కృషి చేయడం లేదు. దీంతో పార్టీని నమ్ముకున్న వారు.. పార్టీకోసం.. కేసులు పెట్టినా వెరవకుండా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నవారికి ఎలాంటి గుర్తింపు లేకుండా పోతోందని వాపోతున్నారు. మరోవైపు చంద్రబాబు మాత్రం కష్టపడేవారికి మాత్రమే పదవులు ఇస్తామని చెబుతున్నా.. ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతోందని చెబుతున్నారు.