ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.. ఇది ఇప్పుడు ఠక్కున సమాధానం చెప్పలేని ప్రశ్నగా మారింది. ఏపీకి ప్రస్తుత రాజధాని అమరావతి.. దీన్ని చంద్రబాబు ప్రభుత్వం డిసైడ్ చేసింది. అప్పట్లో మనసులో ఏమున్నా సరే.. జగన్ కూడా అమరావతిని రాజధానిని చేయడాన్ని వ్యతిరేకించలేదు. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యాక సీన్ మారిపోయింది. రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు జగన్ మూడు రాజధానుల ఎత్తు వేశారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.


అంతే కాదు.. మూడు రాజధానుల బిల్లు కూడా పెట్టి చట్టం తీసుకొచ్చారు. దీనిపై కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు జగన్ సర్కారు ఆ బిల్లును రద్దు చేసుకుని.. లోపాలు లేకుండా సరికొత్త బిల్లు తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఏదేమైనా సరే.. అమరావతి నుంచి రాజధానిని విశాఖ తీసుకెళ్లాల్సిందే అన్నది జగన్ మనోగతం.. ఇప్పుడు దీనికి సినిమా ఇండస్ట్రీ అంశం కూడా కలసి వస్తోంది. తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన సినిమా పెద్దలకు జగన్ తన మనోగతం బయటపెట్టారు.


క్రమంగా విశాఖకు సినీపరిశ్రమ తరలిరావాలని సూచించారు. విశాఖపట్నానికి సినీ పరిశ్రమ వస్తే.. అందరికీ స్థలాలు ఇస్తానన్నారు. హైదరాబాద్‌లోనే కాదు..  నెమ్మదిగా ఇక్కడ కూడా దృష్టి పెట్టండని సినిమా పెద్దలకు సూచించారు. తెలంగాణాతో పోలిస్తే ఫిల్మ్‌ ఇండస్ట్రీకి  ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్‌ చేస్తోందన్న విషయాన్ని గుర్తు చేసారు. తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్‌ చేస్తే.. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్‌ చేస్తోందని సినీ పెద్దలకు గుర్తు చేశారు.


విశాఖలో స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తే స్థలాలు ఇస్తామని.. ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్‌ తరహా ప్రాంతాన్ని క్రియేట్‌ చేద్దామని జగన్ అంటున్నారు. విశాఖ బిగ్గెస్ట్‌ సిటీ అనీ.. దాన్ని కాస్త పుష్‌ చేయగలిగే అవకాశాలున్న సిటీ అని జగన్ అంటున్నారు. విశాఖ.. చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీపడుతుందని.. దాన్ని మనం ఓన్‌ చేసుకోవాలని అన్నారు.
మరి విశాఖకు సినిమా పరిశ్రమ తరలిరావాలన్న జగన్ కోరికను సినిమా ఇండస్ట్రీ తీరుస్తుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: