ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రులుగా సీనియర్లు ఎక్కువ మంది ఉన్నారు.అయితే,. వీరిలో ఒకరిద్దరు స్వచ్ఛందంగా పదవులు వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. మిగిలిన వారినిజగన్ కంటిన్యూ చేస్తార ని తెలుస్తోంది. ఇక, మిగిలిన వారిలో జూనియర్లను తీసేసి.. సీనియర్లకు అవకాశం కల్పిస్తారని అంటున్నా రు. వచ్చేది అంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అడుగులు వేయాల్సిన నేపథ్యంలో పటిష్టమైన కేబినెట్ ఉంటే తప్ప.. ప్రభుత్వంపై పాజిటివ్ వేవ్ రాదనే సీఎం జగన్ ఉన్నారని అంటున్నారు.
ఈ క్రమంలోనే.. ఆయన సీనియర్లకు ఎక్కువగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది.
జూనియర్లలో ముఖ్యంగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన గోపాలకృష్ణ, పుష్ప శ్రీవాణి, వనిత, గుమ్మనూ రు జయరాం, నారాయణ స్వామి, శంకరనారాయణ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరికి ఖచ్చితంగా ఉద్వాసన తప్పదని.. పార్టీ వర్గాలో జోరుగా చర్చ సాగుతోంది. అదేసమయంలో సీనియర్లుగా ఉన్న బొత్స సత్యనారాయణ స్వచ్ఛందం పదవిని వదులుకునేందుకు రెడీగా ఉన్నారు.
ఆయన అనారోగ్యంతో ఉన్నారని..కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసే అవకాశం లేదని.. తన సీటును కుమారుడికి, లేదా సతీమణికి ఇవ్వాలని ఆయన సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈయనను పక్కన పెడతారని అంటున్నారు. మిగిలిన వారిలో సీనియర్లను దాదాపు అలానే ఉంచి.. 10 మంది వరకు కొత్తవారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.