అంటే.. మొత్తంగా ఆయన వైసీపీలో ఆత్మాభిమానం లేనివారే ఉన్నారని..చెప్పుకొచ్చారు. ఆత్మాభిమానం ఉన్నవారు బయటకు రావాలని పిలుపునిచ్చారు. అంటే తమ పార్టీ ఉందని పరోక్షంగా ఆయన పేర్కొన్నారు. ఇక్కడే ఒక కీలక విషయం అంతుబట్టడం లేదని అంటున్నారు పరిశీలకులు. అదేంటంటే.. ఉన్న ఒక్క నాయకుడిని (గత ఎన్నికల్లో గెలిచిన) కాపాడుకోవడం తెలియని వారికి .. పొరుగు పార్టీలోని నేతలను రమ్మనే హక్కు ఉంటుందా? అనేది కీలక ప్రశ్న. నిజానికి ఆత్మగౌరవం వంటి వ్యాఖ్యలు చేసే జనసేన పార్టీకి అసలు ఆత్మగౌరవం ఉందా? అనేది మరో ముఖ్య ప్రశ్న అంటున్నారు నెటిజన్లు.
ఆత్మ గౌరవం ఉండి ఉంటే.. బీజేపీతో కలిసి చెట్టాపట్టాలేసుకుని ముందుకు సాగేవారు కాదని అంటున్నారు. అంతేకాదు.. అసలు.. రాష్ట్రంలో ఏ పార్టీతో ఏ క్షణంలో పొత్తు పెట్టుకుంటారో.. ఏ పార్టీని జోలపాడతారో.. తెలియని మీరా.. ఆత్మగౌరవం గురించి మాట్లాడేదని వైసీపీ నాయకులు కూడా చెబుతున్నారు. ఆత్మగౌరవం ఉంటే.. పార్టీని నడిపించడంలో ఇంత తలకిందలుగా తపస్సు చేయడం ఎందుని అంటున్నారు. అసలు పవన్ రాజకీయం ఆ పార్టీ వీరాభిమానులకే అర్థం కావడం లేదు. చివరకు వాళ్లు కూడా పార్టీని వదిలేసి పవన్ సినిమా వచ్చినప్పుడు హంగామా చేసి మాయం అయిపోతున్నారు.
నిజానికి సినిమా టికెట్ వివాదం ఉంటే.. అక్కడి వరకు పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి కానీ.. ఇలా రాజకీయాలకు ముడి పెట్టి.. ఆత్మాభిమానం.. ఆత్మగౌరవం అంటూ.. వ్యాఖ్యలు చేయడం వల్ల.. జనసేనకే.. ఎదురు దాడి తప్పదని.. ఇది పెద్ద కామెడీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.