ఏపీలో రహదారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పటికే అనేక సార్లు మీడియాలో ప్రముఖంగానే వచ్చింది. అయితే రహదారులు ఏపీలో బాగాలేకపోవడం వల్ల రహదారి ప్రమాదాలు అసాధారణంగా పెరిగినట్టు రహదారి భద్రతా  కౌన్సిల్ గణాంకాలు చెబుతున్నాయి. రోడ్లు బాగా లేని కారణంగానే రోడ్డు ప్రమాదాలు 10.16 శాతం, మరణాలు 14.08 శాతం మేర పెరిగాయట. ఈ ప్రమాదాల్లో ఎక్కువ తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలో నమోదయ్యాయట.


అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం.. రహదారి ప్రమాదాలు 2021 ఏడాదిలో అసాధారణంగా పెరిగాయట. 2021లో అనేక వాహనాల ద్వారా దాదాపు 20 వేల ప్రమాదాలు జరిగితే వాటిలో 8 వేలమందికిపైగా మృతి చెందారట. ఈ విషయాన్ని  రోడ్ సేఫ్టీ కౌన్సిల్ స్పష్టం చేస్తోంది. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా  25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులు మృతి చెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పురుషులు మొత్తం... 1679 మంది రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు.


18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులు 1326 మంది మృతి చెందారు. 35-45 ఏళ్ల మధ్య వయస్కుల మరణాలు 1625 గా నమోదు అయ్యాయి. 35 నుంచి 45 ఏళ్ల వయస్సున్న మహిళలు 272 మంది చనిపోయారట. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు 234 మంది రహదారి ప్రమాదాల్లో మృతి చెందారుని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2002 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు.


గుంటూరు జిల్లాలో అత్యధికంగా 953 మంది రోడ్డు ప్రమాదాలతో చనిపోయారు.  ఇవి కాక  కార్లు, జీపులు, వ్యాన్ల లాంటి వాహనాల వల్ల జరిగిన ప్రమాదాల సంఖ్య 2399 గా ఉంది. ఇక ఫుట్ పాత్  ప్రమాదాలు 4275 వరకూ జరిగాయి. రోడ్ల పరిస్థితి బాగా లేకపోవడమే ఇంతగా ప్రమాదాలు పెరగడానికి కారణం అన్నవాదన వినిపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చాక రోడ్లను అస్సలు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. మరి వీటికి జగన్ సర్కారు ఏమని బదులిస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: