ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితం త‌ర్వాత‌.. ఏపీలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ్యూహం మార్చుకుంటుందా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. త‌న అడుగులు కొత్త‌గా వేయాల‌ని అనుకుంటోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు.. వైసీపీని బ‌లంగా ఎదుర్కొనేందుకు.. ప‌క్కా స్కెచ్‌తో ముందుకుసాగాల‌ని టీడీపీ భావించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. విష‌యంలోకివెళ్తే.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో.. పాగా వేయాల‌ని.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలో పంజాబ్‌లో అధికారం ద‌క్కించుకుంది.

అంతేకాదు.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల బ‌లంగా అభ్య‌ర్థుల‌ను గెలిపించుకుంది. ఇది.. ఆప్‌కు క‌లిసి వ‌చ్చిన అవ‌కాశంగామారింది. త్వ‌ర‌లోనే జాతీయ రాజ‌కీయాల్లోనూ బ‌ల‌మైన ప‌క్షంగా ఎద‌గాల‌ని భావి స్తున్న ఆప్‌కు ఈ ఎన్నిక‌లు క‌ల‌సి వ‌చ్చాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఏపీలోనూ.. ఆప్ వంటిబ‌ల మైన పార్టీ అడుగు పెడితే.. ఆ ప్ర‌భావం వేరేగా ఉంటుంద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆప్‌.. కూడా ఏపీలో పార్టీని పెట్టింది. కొంత కేడ‌ర్ కూడా ఉంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు సీరియ‌స్‌గా మాత్రం పార్టీ ప్ర‌య‌త్నించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వ‌చ్చిన తీర్పుతో రాబోయే రోజుల్లో ఆప్ ఏపీలో బ‌లంగా పుంజుకునే అవ‌కాశం ఉం ది. ఈ క్ర‌మంలో.. టీడీపీ ఆప్‌తో క‌లిసి ముందుకు సాగితే ఫ‌లితం ఉంటుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నా యి. ఎందుకంటే.. గ‌తంలో చంద్ర‌బాబు, ఆప్ అధినేత ఇద్ద‌రూ కూడా అనేక సంద‌ర్భాల్లో ఒకే వేదిక పంచుకు న్నారు. ఈ క్ర‌మంలో 2019 ఎన్నిక‌లప్పుడు... చంద్ర‌బాబు త‌ర‌ఫున విజ‌య‌వాడ‌లో కేజ్రీవాల్ స్వ‌యంగా ప్ర‌చారం చేశారు. సో.. చంద్ర‌బాబుకు, కేజ్రీవాల్‌కు కెమిస్ట్రీ కుదురుతుంద‌నేది అప్ప‌ట్లోనే తేలిపోయింది. సో.. ఇప్పుడు చంద్ర‌బాబు వ్యూహం మార్చుకుని కేజ్రీవాల్ తో పొత్తుకు సిద్ధ‌మైతే.. ఇక‌, తిరుగులేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చంద్ర‌బాబు కూడా త‌న పాత మిత్రుడిని క‌లుపుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: