ఏపీ రాజ‌కీయాల్లో కొన్ని రోజులుగా ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ముఖ్యం గా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఎక్కువ‌గా దీనిపైనే ఫోక‌స్ పెంచింది.. ఏపీలో ఎప్పుడైనా ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని.. కాబ‌ట్టి త‌మ్ముళ్లు సిద్ధంగా ఉండాల‌ని .. పార్టీ అధినేత చంద్ర‌బాబు నిత్యం చెబుతున్నారు. అయితే.. ముందుగా.. అస‌లు ముందస్తు రావ‌డానికి.. చంద్ర‌బాబు కు ఉన్న అంచనాలు చూద్దాం. మొత్తం మూడు కార‌ణాల‌తో చంద్ర‌బాబు ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

ఒక‌టి.. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌భుత్వం రికార్డు స్థాయిలో సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తోంది. నిజానికి ఆదాయం ఉంటే.. సంక్షేమం అమ‌లు చేయొచ్చు. కానీ, ఆదాయం లేదు. అప్పులు చేసి దీనిని అమ‌లు చేస్తున్నారు. మ‌రో ఆరు మాసాలు ఆగితే.. అప్పులు పుట్టే అవ‌కాశం లేదు. దీంతో సంక్షేమం నిలిచి పోయే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ముంద‌స్తుకు వెళ్లి.. తాము చేసిన సంక్షేమాన్ని చూపించి.. మ‌రోసారి ప్ర‌జ‌ల తీర్పు కోరే అవ‌కాశం క‌నిపిస్తంది.

రెండు:  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ బ‌ల‌ప‌డుతోంద‌ని.. వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. నిజానికి ఇదే జ‌రిగితే.. వైసీపీ వ్య‌తిరేక‌త పెరిగే అవకాశం ఉంది. అందుకే.. టీడీపీ బ‌లోపేతం అయ్యేలోగానే.. ముంద‌స్తుకు వెళ్లిపోయి.. టీడీపీకి షాక్ ఇవ్వాల‌ని.. వైసీపీ నాయ‌కులు నిర్ణ‌యించుకుంటున్న‌ట్టు.. టీడీపీ వ‌ర్గాలుచెబుతున్నాయి. ఇదే జ‌రిగితే.. ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయంగా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మూడు..:  ముంద‌స్తుకు వెళ్ల‌క‌పోతే.. 2024లోనే ఒకేసారి సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇది జ‌రిగితే.. ఆర్థికంగా ఎంపీలు.. ఎమ్మెల్యేల‌ను ఆదుకునే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే..వారు కూడా క‌ర్చు చేసుకోవాలి కాబ‌ట్టి.. ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది. సో.. ఈ క్ర‌మంలో కూడా ముంద‌స్తు కు వెళ్లే ప్లాన్‌లో వైసీపీ ఉన్న‌ట్టు టీడీపీ నాయ‌కులు, అధిష్టానం కూడా అంచ‌నా వేస్తోంది.

ఒక‌వేళ ఈ కార‌ణాల‌తో వైసీపీ ముంద‌స్తుకు వెళ్తే.. మంచిదేనా? అనేది ఇప్పుడు చూద్దాం. ఉమ్మ‌డి ఏపీలో మూడు సార్లు ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగాయి. అన్న‌గారు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌డు.. అప్ప‌టి కాంగ్రెస్ ముంద‌స్తుకు వెళ్లి ఓడిపోయింది. త‌ర్వాత‌.. అన్నగారే.. ముంద‌స్తుకు వెళ్లి.. ఓడిపోయారు. ఇక‌, 2004లో చంద్ర‌బాబు ముంద‌స్తుకు వెళ్లి ప‌రాజ‌యం పాల‌య్యారు. ప్ర‌స్తుతం న‌వ్యాంధ్ర‌లో గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ముంద‌స్తుకు వెళ్ల‌లేదు. క‌వేలం తెలంగాన‌లో కేసీఆర్ స‌ర్కారు మాత్ర‌మేముంద‌స్తుకు వెళ్లింది. కొన్ని కార‌ణాల‌తో విజ‌యం ద‌క్కించుకుంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీకి అంత ఎడ్జ్ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: