టీడీపీ నాయ‌కులు.. వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ప్ర‌జ‌ల  నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పార్టీ బ‌లాన్ని అంచ నా వేయ‌డంలో నాయ‌కులు విఫ‌ల‌మ‌వుతున్నార‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయింది. నిజ మే. అదే ఓట‌మి.. కొన‌సాగుతుంద‌ని..ఎందుకు అనుకోవాల‌ని.. పార్టీ సానుభూతి ప‌రులు ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో ఇంత‌క‌న్నా.. ఘోర పరాజ‌యం పాలైన పార్టీలు కూడా ఉన్నాయ‌ని.. చెబుతున్నారు. అంతెందు కు.. గ‌తంలో టీడీపీ అత్యంత ఘోరంగా ఓడిపోయిన ప‌రిస్తితి ఉంది. వ‌రుస ఓట‌ములు కూడా చ‌విచూసిన ప‌రిస్థితి ఉంది. కానీ, ఏనాడూ కుంగిపోలేదు. మ‌ళ్లీ పుంజుకుని.. ప్ర‌జాక్షేత్రంలో నిలబ‌డింది.

అయితే.. ఈ విష‌యాన్ని అంచ‌నా వేయ‌డంలో మాత్రం.. చాలా మంది త‌మ్ముళ్లు క‌ట్టు త‌ప్పుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ``పార్టీ పుంజుకునేలా లేదు`` అని అసెంబ్లీ లాబీల్లో ఒక కీల‌క మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యానం..పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. వాస్త‌వానికి దీనిని క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేసినా.. ఎక్క‌డా ద‌గ‌డం లేదు. కానీ.. ఆ మాజీ ఎంపి ఎప్పుడు ఏం మాట్లాడినా యాంటీగానే వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరు కూడా ఉంది.

ఆయ‌న మాట‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. అయితే.. ఈ క్ర‌మంలో క్షేత్ర‌స్థాయి లో మ‌రికొంద‌రు కూడా ఇలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఇప్ప‌టికీ.. పార్టీలో కొన్ని జిల్లాల‌ను ప‌రిశీలిస్తే.. నైరాశ్యం క‌నిపిస్తోంది. ఎన్నిక‌లకు ఇంకా స‌మ‌యం ఉంద‌ని కొంద‌రు.. ఇప్పుడే ఏం చేస్తామ‌ని మ‌రికొంద‌రు ఇలా.. ఎవ‌రి ధోర‌ణిలో వారు ఉన్నారు. మ‌రికొంద రు.. మ‌నంచేస్తే.. ఎంత చేయ‌క‌పోతే.. ఎంత ధిక్కార స్వ‌రం కూడా వినిపిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో పార్టీలో జరుగుతున్న చ‌ర్చ‌కు అంతం చెప్పాలంటే.. చంద్ర‌బాబు జోక్యం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. పార్టీ ఇప్పుడు ఓడింది కాదు.. గ‌తంలో గెలిచింది కూడా కాదు. గెలుపు ఓట‌ములు పార్టీకి కొత్త‌కూడాకాదు. సో.. పార్టీకి ఉన్న బ‌లాబ‌లాల‌ను తెలుసుకుని.. ఆదిశ‌గా అడుగులు వేస్తే.. గెలుపు త‌ధ్య‌మ‌నే భావ‌న‌ను పార్టీ అధినేత చంద్ర‌బాబు క‌ల్పించాల‌ని కోరుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: