ఏదైనా ఉంటే.. చర్చించేందుకు అవకాశం ఉంటుంది. అంతేతప్ప.. సభను పూర్తిగా గందరగోళంలోకి నెట్టే యడం వల్ల ఏంటి ప్రయోజనం.. అంటున్నారు.. ఇక, ఈ క్రమంలోనే సభలో స్పీకర్ అనుసరిస్తున్న విధా నాన్ని కూడా ఎవరూ తప్పుపట్టడం లేదు. ఆయన చాలా వరకు అవకాశం ఇస్తున్నారని.. ఎంతో ఓర్పుగానే ఉన్నారని.. ఉత్తుత్తినే వారిని సస్పెండ్ చేసేయడం లేదని.. కూడా అంటున్నారు. ఈ సమయంలో తప్పు టీడీపీ నేతలవైపే ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో సీనియర్లు, మరెంతో అనుభవం ఉన్న బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప వంటివారు కూడా సంయమనం కోల్పోవడం సరికాదని చెబుతున్నారు. వీళ్లు సీనియర్ నేతలు.. గత ఎన్నికల్లో పార్టీ ఎంత చిత్తుగా ఓడినా గెలిచిన వారు. రాజకీయాల్లో 35 ఏళ్ల నుంచి ఉన్న వారు... ఎన్నో సందర్భాల్లో ఎన్నో కష్టనష్టాలు చూశారు. వీరు ఎంతో సంయమనంతో ఉండాల్సి ఉంది. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా చేయడం వెనక... మరీ ముఖ్యంగా చంద్రబాబు కావాలనే ఇలా చేయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కొంత సంయమనంగా వ్యవహరించి.. సభకు టీడీపీ సభ్యులు సహకరించేలా చేయాలని.. పలువురు సూచిస్తున్నారు. గతంలో వైసీపీనేతలు ఆందోళన చేసినప్పుడు..ఎలా అయితే.. సభ ఇబ్బంది పడిందో ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. పైగా టీడీపీకి కీలకమైన సమయం ఉందని.. ఈ సమయంలో ఒకింత ఓర్పుగా వ్యవహరించి.. సభలో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తే.. ఆటోమేటిక్‌గగా ప్రభుత్వ పక్షమే.. ఇబ్బందుల్లో పడుతుందని.. తద్వారా.. ప్రజల దృష్టిలో టీడీపీకి మంచి మార్కులు పడతాయని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.