ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నా.. రాజకీయాలు మాత్రం అప్పుడే జోరందుకున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయా అన్న రేంజ్‌లో నాయకులు చెలరేగిపోతున్నారు. ప్రత్యేకించి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఇటీవల జోరు పెంచింది. ప్రత్యేకించి ఏపీలో జరుగుతున్న అత్యాచార ఘటనలను తనకు రాజకీయం అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే.. అలా చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు అమానవీయంగా ఉంటున్నాయి.


మొన్నటికి మొన్న విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగింది. అయితే.. ఆమెను పరామర్శించేందుకు చంద్రబాబు అండ్ టీమ్ మందీమార్బలంతో వచ్చిన విషయం వివాదాస్పదం అయ్యింది. ఆయన ఏకంగా మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మను అవమానించారని.. అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. బాధితులకు అండగా నిలస్తున్నామన్న పేరుతో వారి పేరట రాజకీయం చేయాలన్న టీడీపీ వ్యూహం వైసీపీ నేతలకు మింగుడుపడటం లేదు.


విజయవాడ అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ మొన్న టీడీపీ మహిళలు రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఓ అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేశ్ వెళ్లడం వివాదాస్పదం అయ్యింది. నారా లోకేశ్ రాజకీయాలు చేసేందుకు వచ్చారంటూ వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో పరామర్శకు వచ్చిన టీడీపీ నేతలు, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.


ఒక దశలో రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. ఇలా ఏపీలో అత్యాచారాల చుట్టూ రాజకీయాలు చోటు చేసుకోవడం విచారకరం. ఎక్కడో ఒక దగ్గర జరిగే అత్యాచారాలను ఆపడం కష్టమే. అయితే.. విషయం బయటకు రాగానే పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోడం.. పరిహారం అందించకపోవడాన్ని విమర్శించవచ్చు.. కానీ ఆ పేరుతో రచ్చ చేయడమూ భావ్యం కాదు. మరి ఈ రేపు రాజకీయాలు ఇంకెంత దూరం వెళ్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: