తెలుగు దేశం పార్టీ మహానాడుకు సిద్దం అవుతోంది. మహానాడు నిర్వహణ కోసం చంద్రబాబు తగిన ప్లాన్ రెడీ చేశారు. మహా నాడు నిర్వహణ కోసం చంద్రబాబు 16కమిటీలు ఏర్పాటు చేశారు. ఈనెల 27, 28 తేదీల్లో ఒంగోలులో తెలుగుదేశం మహానాడు జరగబోతోంది. నారా లోకేష్ నేతృత్వంలో మహానాడు నిర్వహిస్తారు. ఆయనే సమన్వయ కమిటీ బాధ్యతలు స్వీకరిస్తారు. అచ్చెన్నాయుడు, బక్కని నరసింహులు అధ్యక్షతన ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు.


ఇక మహానాడు  తీర్మానాల కమిటీలో యనమల రామ కృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాల్వ శ్రీనివాసులు, షరీఫ్‌, నక్కా ఆనంద్‌ బాబు, నిమ్మల రామా నాయుడు, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే మహానాడు   వసతి ఏర్పాట్ల కమిటీలో బీదా రవి చంద్ర యాదవ్, ఏలూరి సాంబశివ రావు, డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.


మహానాడు సభా నిర్వహణ కమిటీలో  పయ్యావుల కేశవ్‌, రామ్మోహన్‌ నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర తదితరులకు చంద్రబాబు స్థానం కల్పించారు. ఇక మహానాడు అతిథులకు భోజన ఏర్పాట్లను నిమ్మకాయల చిన రాజప్ప, అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్‌ టీమ్ చూసుకుంటుంది.


ఈనెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగే ఈ తెలుగుదేశం మహానాడును ఆపార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. వచ్చే రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. అందులోనూ కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ కార్యక్రమం సరిగ్గా సాగలేదు. అందుకే ఈసారి రెట్టించిన ఉత్సాహంతో మహానాడు నిర్వహించుకుని అధికార వైసీపీకి ఝలక్ ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ పట్టుదలతో ఉంది. ఎన్నికలకు క్రమంగా సమయం దగ్గర పడుతున్న సమయంలో కార్యకర్తల్లో స్థైర్యం నింపేందుకు ఈ మహానాడును ఓ అవకాశంగా చంద్రబాబు మలచుకుంటున్నారు. మరి చూడాలి ఈసారి మహానాడు ఎంత ఘనంగా జరుగుతుందో?


మరింత సమాచారం తెలుసుకోండి: