మరి అప్పట్లో చంద్రబాబు ఎందుకు అలా చేశారంటే... అధికారం కోసమో.. పార్టీ ని కాపాడుకోసమో అనే కారణాలు ఉన్నాయి. మరి లోకేశ్ ఎందుకు వెన్నుపోటు పొడుస్తాడు.. ఆయనకు ఆ అవసరం ఏముంది అన్న ప్రశ్నలు రావచ్చు. అయితే.. చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను కొడుకుగా గుర్తించడం లేదట. ఎందుకంటే.. కనీసం ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు కనుక ఆయనకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయిందట. పార్టీలో లోకేశ్‌కు విలువ లేకుండా పోయిందట. లోకేశ్‌ను ఒక వ్యక్తిగా ఎవరూ గుర్తించని విధంగా చంద్రబాబు తీసుకొచ్చాడట.
అందుకే నారా లోకేశ్.. తండ్రికి వెన్నుపోటు పొడుస్తాడని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి సూత్రీకరిస్తున్నారు. చంద్రబాబు అనే వాడు.. వంచన అనే తండ్రికి, వెన్నుపోటు అనే తల్లికి పుట్టిన ఉన్మాది అంటూ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత కూడా లేదని.. చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని విజయ సాయి రెడ్డి అంటున్నారు.
అసలు ఇంతకీ ఇలా ఇంత ఘాటుగా vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి విమర్శించడానికి కారణం ఏంటంటే.. వైసీపీ అధినేత జగన్‌ను చంద్రబాబు ఉన్మాది అంటూ విమర్శించారు. చంద్రబాబు మా సీఎంగారిని ఉన్మాది అంటున్నాడని.. నిజానికి ఆ ఉన్మాది తనంతోనే తనకు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచాడని.. మనోవేదనకు గురి చేసి మరణానికి కారణమయ్యాడని vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి అంటున్నారు.