ఒక నోబెల్ శాంతి బహుమతి వేలంలో రికార్డు స్థాయి ధర పలకింది. ఏకంగా 103.5 మిలియన్ డాలర్ల మొత్తానికి అమ్ముడుపోయింది. 2021 ఏడాదిలో నోబెన్ శాంతి బహుమతి గెలుచుకున్న రష్యన్ జర్నలిస్టు దిమిత్రి మురతోవ్‌ తన నోబెల్ శాంతి బహుమతిని వేలంలో పెట్టాడు.. ఎందుకోసమో తెలుసా.. ఉక్రెయిన్ శరణార్థి చిన్నారుల సహాయం కోసం తన నోబెల్ బహుమతినే వేలం పెట్టేశాడు. ఈ ప్రతిష్ఠాత్మక బహుమతిని అమెరికాకు చెందిన హెరిటేజ్ ఆక్షన్స్‌ వేలం వేసింది.


ఈ వేలంలో సదరు నోబెల్ బహుమతికి ఇలా రికార్డు ధర నమోదైంది. ఈ రష్యా జర్నలిస్టు ఎవరంటే.. ఈ దిమిత్రి మురతోవ్‌.. రష్యన్ పత్రిక నొవయా గెజెటాకు ఎడిటర్ ఇన్‌ చీఫ్‌. ఈ నొవయా గెజిటా రాజకీయ, సామాజిక వ్యవహరాలపై విమర్శనాత్మక, పరిశోధనాత్మక కథనాలు అందించే స్వతంత్ర వార్తా సంస్థ. రష్యాలో భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణకు చేస్తున్నందుకుగా 2021లో ఈ నోబెల్ బహుమతి మురతోవ్‌కు వచ్చింది.


రష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌ పై దాడి చేస్తున్నట్టే.. గతంలో క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించింది. అప్పట్లో క్రిమియా తరపున దిమిత్రి మురతోవ్‌ పోరాడారు.. అలాగే  ప్రస్తుతం ఉక్రెయిన్‌పై జరుపుతోన్న దాడిని కూడా ఈ రష్యన్ జర్నలిస్టు మురతోవ్‌ తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న దాడుల వల్ల లక్షల మంది చిన్నారులను శరణార్థులుగా మారారు. అలాంటి వారిని కొంతైనా ఆదుకోవాలన్న లక్ష్యంతో దిమిత్రి మురతోవ్‌ తన నోబెల్ బహుమతిని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు.

దిమిత్రి మురతోవ్‌ ఆశించినట్టుగానే తన నోబెల్ బహుమతికి వేలంలో మంచి ధర పలికింది. ఈ వేలంలో నోబెల్ బహుమతి 103.5 మిలియన్ల డాలర్ల ధర పలకడం ఓ రికార్డుగా చెబుతున్నారు. అయితే ఇంత ధర వెచ్చించి దీనిని కొన్నది ఎవరో మాత్రం వేలం సంస్థ హెరిటేజ్ ఆక్షన్స్ వెల్లడించలేదు. ఇక గతంలోనూ నోబెల్ బహుమతులను అనేకసార్లు వేలం వేశారు. దాదాపు పదేళ్ల క్రితం ఇలాగే  2014లో నోబెల్ పురస్కారానికి వేలం వేస్తే 4.76 మిలియన్ల డాలర్లు దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ కొత్త వేలంతో ఆ రికార్డు చెరిగిపోయినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: